iPhone 17 Flipkart Deal: లేటెస్ట్ ఐఫోన్ పై రిపబ్లిక్ డే సేల్ బిగ్ డీల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

Updated on 14-Jan-2026
HIGHLIGHTS

2026 రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన అతిపెద్ద సేల్

iPhone 17 Flipkart Deal ఈరోజు రివీల్ చేసింది

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది

iPhone 17 Flipkart Deal: 2026 రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన అతిపెద్ద సేల్, రిపబ్లిక్ డే సేల్ 2026 నుంచి బిగ్ డీల్ ఈరోజు రివీల్ చేసింది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఐఫోన్ 17 ఫోన్ ను గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఇది ఆపిల్ నుంచి కొత్తగా వచ్చిన ఐఫోన్ మరియు గొప్ప ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ లేటెస్ట్ ఐఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుండి డిస్కౌంట్ ధరలో అందుకునే అవకాశం ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ ద్వారా మీ ముందుకు వచ్చింది.

iPhone 17 Flipkart Deal

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మెంబర్స్ కు ఒకరోజు ముందు, అంటే జనవరి 16వ తేదీ నుంచి ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. అంటే, వీరికి ఈ సేల్ జనవరి 16వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది.

ఫ్లిప్ కార్ట్ ప్రకారం, ఐఫోన్ 17 ఫోన్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 74,990 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చని తెలుస్తోంది. అయితే, ఎటువంటి డిస్కౌంట్ ఆఫర్స్ జతకానున్నాయో మాత్రం క్లియర్ గా వెల్లడించలేదు. ప్రస్తుతం, ఐఫోన్ 17 బేసిక్ వేరియంట్ రూ. 82,900 ప్రైస్ ట్యాగ్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 79,400 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Lava Upcoming Mobile: డ్యూయల్ స్క్రీన్ తో కొత్త ఫోన్ ప్రకటించిన లావా.!

iPhone 17 : ఫీచర్స్

ఐఫోన్ 17 ఫోన్ లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz ప్రో మోషన్ రిఫ్రెష్ రేట్, HDR, ట్రూ టోన్ కలర్ మరియు 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కొత్త 3nm జనరేషన్ Apple A19 Chip తో పని చేస్తుంది మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యాపిల్ iOS 26 తో కొత్త Apple Intelligence ఫీచర్లు మరియు స్క్రీన్ ఇంటెలిజెన్స్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఉంటుంది.

ఈ ఫోన్ లో 48MP డ్యూయల్ ఫ్యూజన్ అండ్ 48MP ఫ్యూజన్ అల్ట్రా వైడ్ సెన్సార్లు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 18MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు మరియు వెనుక కెమెరాతో ఒకేసారి వీడియో రికార్డింగ్ చేసే డ్యూయల్ క్యాప్చర్ వీడియో ఫీచర్ కలిగి వుంది. ఈ ఫోన్ తో 60FPS 4K Dolby Vision వీడియో రికార్డింగ్ చేయవచ్చని యాపిల్ తెలిపింది. ఈ ఫోన్ లో టన్నుల కొద్ది యాపిల్ కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఒక పవర్ ప్యాక్డ్, ఫోటోగ్రఫీ మరియు ఫ్లాగ్‌షిప్ టియర్ ఫోన్. ఇది కొత్త అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మరింత మెరుగుపరుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :