iPhone 14 Price Cut: 37 వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న ఐఫోన్ 14.!

Updated on 20-Sep-2025
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ బిగ్ డీల్ ను సేల్ కంటే ముందే Live చేసింది

వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రైస్ బాగా తక్కువ చేసి లైవ్ చేసింది

ఈరోజు ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ ని 37 వేల భారీ డిస్కౌంట్ తో కేవలం 40 వేల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది

iPhone 14 Price Cut: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ బిగ్ డీల్ ను సేల్ కంటే ముందే Live చేసింది. వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రైస్ బాగా తక్కువ చేసి లైవ్ చేసింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆపేసింది. కానీ అందుబాటులో ఉన్న డివైసెస్ మాత్రం ఇప్పటికీ సేల్ అవుతున్నాయి. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ కూడా లేటెస్ట్ OS అప్డేట్స్ అందుకుంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ ని 37 వేల భారీ డిస్కౌంట్ తో కేవలం 40 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఈ సూపర్ డీల్ గురించి ఈరోజు వివరాలు తెలుసుకోండి.

ఏమిటి iPhone 14 Price Cut ?

ఐఫోన్ 14 ఇండియన్ మార్కెట్లో రూ. 79,900 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 37 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ దెబ్బకి కేవలం రూ. 42,999 బడ్జెట్ ధరలో ఈ ఫోన్ లభిస్తోంది. ఈ ఫోన్ ను Axis మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించింది.

ఫ్లిప్ ఆకృతి అందించిన ఈ అన్ని ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 40,099 రూపాయల తక్కువ ధరలో అందుకోవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ కంటే ముందే చాలా తక్కువ ధరలో లభించడం మీరు చూడవచ్చు.

Also Read: సెప్టెంబర్ 22 నుంచి Samsung Galaxy S24 Ultra కేవలం రూ. 71,999 ధరకు లభిస్తుంది.!

iPhone 14 : ఫీచర్స్

ఐఫోన్ 14 యాపిల్ యొక్క A15 Bionic చిప్ తో పని చేస్తుంది. ఇందులో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంటుంది మరియు జతగా 128GB స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ (2532 x 1170) పిక్సెల్ రిజల్యూషన్, HDR సపోర్ట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ iOS 16 తో వస్తుంది మరియు లేటెస్ట్ iOS అప్డేట్స్ కూడా అందుకుంటుంది.

ఈ ఫోన్ కెమెరా సెట్టింగ్ పరంగా, ఇందులో వెనుక 12MP మరియు 12MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు కూడా 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 30FPS వద్ద 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు ఆపిల్ సూపర్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది స్టన్నింగ్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ 20 గంటల వీడియో ప్లే అందించే బ్యాటరీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు USB టైప్ C లైటెనింగ్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :