iOS 26.3 Update: ఆసక్తికరమైన ఫీచర్స్ తో కొత్త అప్‌డేట్ అందించిన ఆపిల్.!

Updated on 12-Feb-2026
HIGHLIGHTS

యాపిల్ ఐఫోన్స్ కోసం కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ విడుదల చేసింది

ఈ కొత్త అప్‌డేట్ లో ఆసక్తికరమైన ఫీచర్స్ మరియు మరింత గొప్ప సెక్యూరిటీ యూజర్లకు అందించింది

ఒక ఆసక్తికరమైన ఫీచర్ తో మాత్రం యూజర్లకు మంచి అనుకూలత అందిస్తుంది

iOS 26.3 Update: యాపిల్ ఐఫోన్స్ కోసం కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ నిన్న విడుదల చేసింది. ఈ కొత్త అప్‌డేట్ లో ఆసక్తికరమైన ఫీచర్స్ మరియు మరింత గొప్ప సెక్యూరిటీ యూజర్లకు అందించింది. ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ అప్‌డేట్ అవుతుంది మరియు ఇందులో పెద్ద మేజర్ మార్పులు లేవు. కానీ ఒక ఆసక్తికరమైన ఫీచర్ తో మాత్రం యూజర్లకు మంచి అనుకూలత అందిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ ను మరింత కట్టుదిట్టంగా ఉంచే సెక్యూరిటీ ని కూడా జత చేసింది.

iOS 26.3 Update: ఆసక్తికరమైన ఫీచర్

కొత్త ఐఓఎస్ 26.3 అప్‌డేట్ ను సెక్యూరిటీ అప్‌డేట్ మరియు బగ్స్ ఫిక్స్ తో అందించింది. అయితే, ఇందులో ఒక ఆసక్తికరమైన ఫీచర్ ను కూడా అందించింది. అదేమిటంటే, ట్రాన్స్‌ఫర్ టు ఆండ్రాయిడ్ ఫీచర్. ఇప్పు ఈ కొత్త అప్‌డేట్ ద్వారా ఐఫోన్ నుంచి గూగుల్ డివైస్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా సులభంగా చేసింది. అంతేకాదు, ఇది కొత్త బిల్ట్ ఇన్ ట్రాన్స్‌ఫర్ టూల్ తో వస్తుంది. ఈ కొత్త ఫీచర్ తో యాప్స్, ఫోన్ నంబర్స్ మరియు పాస్వర్డ్ వంటి వాటిని నేరుగా ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం అందించింది. ఇది కాకుండా ఈ ఫీచర్ తో సింక్రనైజ్ డేటాని కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా మరియు వేగంగా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ పరికరాలకు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం యాపిల్ తన యూజర్లకు అందించింది.

Also Read: Hug Day Big Deal: నథింగ్ ప్రీమియం ఫోన్ Nothing Phone 3 ని సగం ధరకే అందుకోండి.!

iOS 26.3 Update: ఇతర వివరాలు ఏమిటి?

కొత్త ఐఓఎస్ 26.3 అప్‌డేట్ లో మంచి సెక్యూరిటీ ఫీచర్ అందించింది. అదేమిటంటే, ప్రిసైజ్ లొకేషన్ కోసం ప్రత్యేకమైన టైమ్ సెట్టింగ్ అందించింది. కొత్త అప్‌డేట్ తో ప్రిసైజ్ లొకేషన్ తో వచ్చే సెట్టింగ్ ఆన్ చేసినప్పుడు ఇది మొబైల్ నెట్వర్క్ నుంచి స్ట్రీట్-లెవెల్ ప్రిసైజ్ లొకేషన్ కు బదులుగా అంచనా స్థాయి లొకేషన్ ను మాత్రమే చూపిస్తుంది. అయితే, ఎమర్జెన్సీ సమయంలో మాత్రం వర్తించని విధంగా ఉంటుంది. అంటే, ఎమర్జెన్సీ సమయంలో కచ్చితమైన లొకేషన్ వివరాలు అందిస్తుంది.

ఇక తొలగించిన సెక్యూరిటీ సమస్య విషయానికి వస్తే, ముందుగా ఉన్న మెమరీ ఎక్స్ప్లాయిటేషన్ బగ్ మరియు 35 కంటే ఎక్కువ సెక్యూరిటీ అప్‌డేట్ ను ఈ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ లో భాగంగా అందించినట్లు చెబుతోంది. ఇందులో కోర్ ఆడియో బగ్ మరియు గేమ్ సెంటర్ లో సెన్సిటివ్ డేటా యాక్సెస్ బగ్ వంటివి కూడా ఉన్నాయి. అందుకే, ఈ కొత్త అప్‌డేట్ ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని యాపిల్ సూచించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :