Infinix Zero Flip with MediaTek D8020 coming soon
Infinix Zero Flip: మార్కెట్ లోకి కొత్త బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ వస్తోందా అనే చర్చ మొదలయ్యింది. ఎందుకంటే, మంచి ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో గొప్ప స్మార్ట్ ఫోన్ లను అందించిన ఇన్ఫినిక్స్ ఇప్పుడు ఫ్లిప్ ఫోన్ ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఆకట్టుకునే ధరలో వచ్చే అవకాశం ఉండవచ్చని మార్కెట్ వర్గాలు లెక్కలు వేస్తున్నారు. మరి ఈ ఫోన్ లాంచ్ మొదలు కొని ఈ ఫోన్ రూమర్స్ వరకూ అన్ని విషయాల పై ఒక లుక్కేద్దాం పదండి.
ఇన్ఫినిక్స్ అధికారిక X అకౌంట్ నుంచి ఈ ఫోన్ లాంచ్ గురించి వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ లను మరియు ఈ ఫోన్ డిజైన్ ను కూడా అందించింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ ఫోన్ ను అతి త్వరలో లాంచ్ చేస్తుందని మాత్రం టీజింగ్ చేస్తోంది.
Also Read: Lava Blaze 3 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన లావా కొత్త బడ్జెట్ 5జి ఫోన్ సేల్.!
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ను స్లీక్ డిజైన్ తో లాంచ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8020 చిప్ సెట్ తో వస్తుందని కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది. అంతేకాదు, గొప్ప పెర్ఫార్మెన్స్ అందించాడని వీలుగా ఈ ఫోన్ లో 16GB ర్యామ్ ఉంటుందని ఇన్ఫినిక్స్ టీజర్ చెబుతోంది. అయితే, ఫిజికల్ మరియు వర్చువల్ ర్యామ్ తో కలిపి టోటల్ ర్యామ్ ఫీచర్ అవుతుందా లేక కేవలం ఫిజికల్ ర్యామ్ అవుతుందో చూడాలి.
ఈ అప్ కమింగ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 70W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ టీజర్ లో ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ఛార్జ్ టెక్ ను కూడా కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ వివరాలు మాత్రమే ఇన్ఫినిక్స్ అందించింది. అయితే, త్వరలోనే ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ తో పాటు మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను అందించే అవకాశం వుంది.