Infinix Smart 10 price and features nowhere
Infinix Smart 10 : ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ చాలా చవక ధరలో 4 ఇయర్ ల్యాగ్ ఫ్రీ ఫోన్ గా లాంచ్ అయ్యింది. అంటే, ఈ ఫోన్ నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేని పెర్ఫార్మన్స్ అందించే ఫీచర్స్ కలిగి ఉంటుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈరోజు ఇండియా లో విడుదలైన ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని ప్రైస్ వరకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు.
ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో కేవలం రూ. 6,799 ధరలో లాంచ్ చేసింది. ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మీ దగ్గర్లోని మొబైల్ స్టోర్స్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది. ఈ ఫోన్ ఐరిష్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, టైటానియం సిల్వర్, మరియు స్లీక్ బ్లాక్ నాలుగు అందమైన రంగుల్లో లభిస్తుంది.
ఈ లేటెస్ట్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ HD + రిజల్యూషన్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు డైనమిక్ బార్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ UniSoc T7250 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు ఈ ఫోన్ లో 4 జీబీ ఫిజికల్, 4 జీబీ అదనపు ర్యామ్ మరియు 64 జీబీ అంతర్గత మెమరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మాటే ఫినిష్ కలిగిన ప్రీమియం డిజైన్ తో వస్తుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్ వెనుక 8MP డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈ బడ్జెట్ లో తగిన రిజబుల్ వీడియో మరియు ఫోటో అందించే కెమెరాలు కలిగి వుంది. ఈ ఫోన్ XOS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 25,000 పైగా డ్రాప్ టెస్ట్ ను తట్టుకుని గట్టి ఫోనుగా నిలబడినట్లు కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది.
Also Read: కేవలం రూ. 11,999 రూపాయిలకే 256GB స్టోరేజ్ 5G Smartphone అందుకోండి.!
ఈ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చినా 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ తో పాటు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది 48 నెలల TUV Certified ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందించే ఫోన్ అని కూడా ఇన్ఫినిక్స్ పేర్కొంది.