Infinix Note Edge 5G: రేపు విడుదలయ్యే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందే ఈ ఫోన్ కలిగిన కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్స్ అందించాము

ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది

Infinix Note Edge 5G: ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ఒకరోజు ముందే ఈ ఫోన్ కలిగిన కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్స్ మేము అందిస్తున్నాము. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది మరియు ఈ ధరలో ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్స్ ఈ ఫోన్ కలిగి ఉండే అవకాశం ఉంది. ఇలా చెప్పడానికి దారి తీసిన అంశాలు కూడా ఈ రోజు చూద్దాం.

Infinix Note Edge 5G: లాంచ్

ఈ ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్ రేవు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అంటే, ఏ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Infinix Note Edge 5G: ఫీచర్స్

ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జి ఫోన్ కర్వుడ్ అంచులతో చాలా స్లీక్ మరియు ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. ఈ ఫోన్ కేవలం 7.2mm మందతో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు ఈ ధర పరిధిలో ఈ ఫీచర్ కలిగిన తోలి ఫోన్ ఇదే అని కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 1.5K రిజల్యూషన్ కలిగిన 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ TUV బ్లూ లైట్ వెరిఫికేషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్ రక్షణ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

రేపు విడుదల కాబోతున్న ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ అందించిన లేటెస్ట్ 5జి ప్రోసెసర్ Dimensity 7100 5G తో పని చేస్తుంది. ఈ ఫోన్ 6 జీబీ మరియు 8 జీబీ ర్యామ్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ను రెగ్యులర్ LPDDR4 ర్యామ్ తో కాకుండా వేగవంతమైన LPDDR5X ర్యామ్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ 7,50,000 కంటే అధిక AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇన్ఫినిక్స్ లేటెస్ట్ UI XOS 16 జతగా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో లాంచ్ అవుతుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లైవ్ ఫోటో మోడ్ తో వచ్చే ఇన్ఫినిక్స్ మొదటి ఫోన్. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్, 10x జూమ్ మరియు AIGC పోర్ట్రైట్ మోడ్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో కెమెరా తో జతగా ఫ్లాష్ లైట్ మరియు RGB హేలో లైట్ ను కూడా అందించింది. ఈ ఫోన్ JBL సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6500mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. అంతేకాదు, గేమింగ్ లేదా హెవీ యూసేజ్ సమయంలో ఛార్జ్ చేసే బైపాస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ లో కూడా వేగవంతమైన రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను ఇన్ఫినిక్స్ అందించింది.

ఈ ఫోన్ కలిగిన ఫీచర్స్ మరియు ఈ ఫోన్ డిజైన్ ద్వారా ఈ ఫోన్ మిడ్ రేంజ్ ఫోన్ గా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ అంచనా ధర వివరాలు క్రింద చూడవచ్చు.

Also Read: LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ నెవర్ బిఫోర్ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!

ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జి : అంచనా ప్రైస్

ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జి స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ఫోన్ గా వస్తుందని ముందు నుంచే చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఒక లీక్ ఫోన్ అండర్ రూ. 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉందని సూచించింది. అయితే, రేపు ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ మాటల్లో నిజం ఎంత ఉందో తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :