Infinix NOTE 60 Pro 5G: హార్ట్ రేట్ సెన్సార్ వంటి సరికొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Infinix NOTE 60 Pro 5G సరికొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

ఇందులో హార్ట్ రేట్ సెన్సార్ వంటి సరికొత్త ఫీచర్లు అందించింది

ఆకర్షణీయమైన డిజైన్ మరియు యాక్టివ్ మాట్రిక్స్ డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి

Infinix NOTE 60 Pro 5G: ప్రముఖ చైనీస్ కంపెనీ ఇన్ఫినిక్స్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే, ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఇందులో హార్ట్ రేట్ సెన్సార్ వంటి సరికొత్త ఫీచర్లు అందించింది. ఈ ఫోన్ ను మనసు దోచుకునే ఆకర్షణీయమైన డిజైన్, వెనుక యాక్టివ్ మాట్రిక్స్ డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.

Infinix NOTE 60 Pro 5G: ప్రైస్

ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8 జీబీ + 128 జీబీ) ను రూ. 31,999 ధరతో లాంచ్ చేసింది. ఇక ఈ ఫోన్ హై ఎండ్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 34,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డీప్ ఓషియన్ బ్లూ, మొఛా బ్రౌన్ మరియు సోలార్ ఆరంజ్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్ అండ్ సేల్

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో తీసుకున్న వారికి రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే ఒకసారి లభిస్తుంది.

అదనంగా, ఈ ఫోన్ తో పాటు రూ. 3,999 రూపాయల విలువైన మాగ్ పవర్ స్పీకర్ మరియు మాగ్ కేస్ ను కూడా ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ ఫోన్ సేల్ ను స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Infinix NOTE 60 Pro 5G: ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ యాక్టివ్ మాట్రిక్స్ డిస్ప్లే మరియు 360 డిగ్రీ అల్యూమినియం ఫ్రేమ్ తో లాంచ్ అయ్యింది. ఇది ఫోన్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది మరియు యూజర్ నచ్చిన లైట్ ఎఫెక్ట్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ ఈ లేటెస్ట్ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 5జి చిప్ సెట్ Snapdragon 7s Gen 4 తో లాంచ్ చేసింది. ఇది 10,00,000 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ 8 జీబీ LPDDR5x ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో AI కోసం ప్రత్యేకమైన వన్ ట్యాప్ ఏఐ బటన్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో ప్రత్యేకమైన హెల్త్ మోనిటరింగ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ రేట్ మరియు బ్లడ్ యాక్సిస్ ఆక్సిజన్ వంటి వివరాలను అందిస్తుంది.

Also Read: Redmi A7 Pro 5G: బడ్జెట్ యూజర్ ని ఆకట్టుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP (OIS) మెయిన్ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లైవ్ ఫోటో, AI Cam, డ్యూయల్ వీడియో మరియు AIGC పోర్ట్రైట్ వంటి చాలా కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6500 mAh బిగ్ బ్యాటరీ ని కంపెనీ అందించింది. అంతేకాదు, 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. ఆడియో కోసం ఈ ఫోన్ లో JBL ట్యూన్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :