ఇన్ఫినిక్స్ రీసెంట్ గా ఇండియాలో ప్రకటించిన Infinix Note 12 స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ రేపు జరగనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి రానుంది మరియు మంచి ఆఫర్లు కూడా ఈ ఫోన్ పైన కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో అందించినా, ఈ ఫోన్ లో మాత్రం మంచి ఫీచర్లనే ఇన్ఫినిక్స్ అందించిందని చెప్పవచ్చు. ఎందుకంటే,ఈ ఫోన్ FHD+ AMOLED డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ వంటి మంచి ఫీచర్లను కలిగి వుంది. మరి రేపు మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనున్న ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర మరియు స్పెక్స్ లను తెలుసుకుందామా.
ఇన్ఫినిక్స్ నోట్ 12 రెండు వేరియంట్స్ లో లభిస్తుంది మరియు వాటి ధరలు క్రింద చూడవచ్చు.
Infinix Note 12 (4GB+64GB) ధర: రూ.11,999
Infinix Note 12 (6GB+128GB) ధర: రూ.12,999
Axis బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,000 డిస్కౌంట్ మరియు అతి తక్కువ No Cost EMI అఫర్ ను కూడా జతచేసింది. ఈ ఫోన్ సేల్ మే 28 నుండి, అంటే రేపటి నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD + రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 100% DCI P3 కలర్ గ్యాముట్, గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందిచడంతో పాటుగా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Helio G88 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB తో పాటుగా 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగి వుంది మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది.
Infinix Note 12 కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరాకి జతగా 2MP డెప్త్ మరియు AI లెన్స్ లను కలిగివుంది. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని డ్యూయల్ LED ఫ్లాష్ టి కలిగి వుంది. ఈ ఫోన్ లో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కలిగిన భారీ 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో DTS Surround Sound సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లను కూడా అందించింది.