చవక ధరకే 6,000mAh బ్యాటరీ, 7GB వర్చువల్ ర్యామ్ ఫోన్ ప్రకటించనున్నఇన్ఫినిక్స్..!!

Updated on 19-May-2022
HIGHLIGHTS

Infinix Hot 12 Play ను భారీ ఫీచర్లతో తీసుకువస్తున్నట్లు ప్రకటించింది

ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ తో వస్తుంది

6.82 ఇంచ్ HD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది

బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ లను అందిస్తున్న మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్, మరొక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లతో తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అదే, Infinix Hot 12 Play స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను మే 23 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆశ్చర్యకరమైన విష్యం ఏమిటంటే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడాని కంటే ముందుగానే ధరలను గురించి టీజ్ చేస్తోంది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ ను రూ.8,XXX ధరతో ప్రకటించనున్నట్లు సూచించింది.

అంటే, ఈ ఫోన్ ను 9 వేల కంటే తక్కువ ధరలో విడుదల చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్లతోనే వస్తున్నట్లు టీజర్ ద్వారా అర్ధమవుతోంది. ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా Flipkart టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా వస్తోంది.

Infinix Hot 12 Play: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా కొన్ని కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా వెల్లడించింది. టీజర్ ద్వారా, ఈ ఫోన్ ఎంటర్టైన్మెంట్ కు అనుకూలమైన పెద్ద 6.82 ఇంచ్ HD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గేమింగ్ మరియు స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ వస్తుంది.

అంతేకాదు, ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T610 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో స్టోరేజ్ ను కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో భారీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. వెనుక 50MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ను కూడా కలిగి ఉంటుంది.              

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :