గత వారం ఇండియాలో విడుదలైన Infinix Hot 11 2022 స్మార్ట్ ఫోన్. కేవలం 8,999 రూపాయల బడ్జెట్ ధరలో వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 పెద్ద FHD+ డిస్ప్లే, 5000 maH బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ 10 వేల కంటే తక్కువ బడ్జెట్ లో కొనుగోలుదారులను ఆకర్షించే కంప్లీట్ ప్యాకేజ్ గా వచ్చింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు మరింత పోటీని పెంచుతుంది. ఈ ఫోన్ యొక్క ఏప్రిల్ 21 వతేది మొదటిసారిగా అమ్మకానికి వస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ తో కేవలం రూ.8,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 21 నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7-అంగుళాల FHD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది గరిష్టంగా 550 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. ఈ ఫోన్ మీడియా Unisoc T610 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జత చేయబడుతుంది. అలాగే, ఇది XOS 10 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.
కెమెరాల పరంగా, ఈ ఇన్ఫినిక్స్ హాట్ 11 202 వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 13MP సెన్సార్ తో అందించింది. జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు LED ఫ్లాష్ ను కూడా జతచేసింది. ముందు భాగంలో, 8MP AI సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని టైప్ C సపోర్ట్ తో కలిగివుంటుంది. ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.