కేవలం రూ.8,999 ధరలో FHD+ డిస్ప్లేతో వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 ఫస్ట్ సేల్..!!

కేవలం రూ.8,999 ధరలో FHD+ డిస్ప్లేతో వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 ఫస్ట్ సేల్..!!
HIGHLIGHTS

Rs.8,999 రూపాయల ధరలో వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్ 11 2022

తక్కువ బడ్జెట్ లో కొనుగోలుదారులను ఆకర్షించే కంప్లీట్ ప్యాకేజ్ గా వచ్చింది

గత వారం ఇండియాలో విడుదలైన Infinix Hot 11 2022

గత వారం ఇండియాలో విడుదలైన Infinix Hot 11 2022 స్మార్ట్ ఫోన్. కేవలం 8,999 రూపాయల బడ్జెట్ ధరలో వచ్చిన ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 పెద్ద FHD+ డిస్ప్లే, 5000 maH బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ 10 వేల కంటే తక్కువ బడ్జెట్ లో కొనుగోలుదారులను ఆకర్షించే కంప్లీట్ ప్యాకేజ్ గా వచ్చింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు మరింత పోటీని పెంచుతుంది. ఈ ఫోన్ యొక్క ఏప్రిల్ 21 వతేది మొదటిసారిగా అమ్మకానికి వస్తుంది. 

Infinix Hot 11 2022: ధర

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్  ఫోన్ 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ తో కేవలం రూ.8,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 21 నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది.

Infinix Hot 11 2022: స్పెక్స్

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7-అంగుళాల FHD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది గరిష్టంగా 550 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. ఈ ఫోన్ మీడియా Unisoc T610 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది  4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జత చేయబడుతుంది. అలాగే, ఇది XOS  10 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

కెమెరాల పరంగా, ఈ ఇన్ఫినిక్స్ హాట్ 11 202 వెనుక భాగంలో డ్యూయల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 13MP సెన్సార్ తో అందించింది.  జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు LED ఫ్లాష్ ను కూడా జతచేసింది. ముందు భాగంలో, 8MP AI సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని టైప్ C సపోర్ట్ తో కలిగివుంటుంది.  ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo