Infinix GT 30 Pro: గేమింగ్ సెంట్రిక్ ఫీచర్స్ మరియు సెటప్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 03-Jun-2025
HIGHLIGHTS

Infinix GT 30 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా అందించింది

గేమర్స్ కోసం ఇన్ఫినిక్స్ ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఫోన్

గేమింగ్ యూజర్లకు అవసరమైన ప్రత్యేక బటన్స్ తో అందించింది

Infinix GT 30 Pro: గేమింగ్ యూజర్లకు అవసరమైన ప్రత్యేక బటన్స్ మరియు లేటెస్ట్ పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా అందించింది. మరి గేమర్స్ కోసం ఇన్ఫినిక్స్ ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఈ ఫోన్ ధర , ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Infinix GT 30 Pro: ప్రైస్

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ రూ. 24,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు 12GB + 256GB వేరియంట్ రూ. 26,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ ఈ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ సేల్ జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పై ఫాస్ట్ డే సేల్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 ICICI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ లేదా ఈ ఫోన్ పై రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ అందుకునే అవకాశం అందించింది.

Infinix GT 30 Pro: ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 8350 Ultimate చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ తో విడుదలైన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్. 12GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప డిజైన్ కలిగి ఉంటుంది మరియు గేమింగ్ కోసం ఫోన్ పై భాగంలో ప్రత్యేకమైన కెపాసిటివ్ గేమింగ్ ట్రిగర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1.5 రిజల్యూషన్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది గొరిల్లా గ్లాస్ 7i గ్లాస్ రక్షణతో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక మెకానికల్ LED లైట్స్ కలిగిన Cyber Mecha Design 2.0 డిజైన్ తో వస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా కలిగి ఉంటుంది.

Also Read: SAMSUNG Smart Tv పై ఈరోజు భారీ డిస్కౌంట్ ప్రకటించిన Flipkart

కెమెరా పరంగా, ఇన్ఫినిక్స్ GT 30 ప్రో ఫోన్ లో వెనుక 108MP ప్రధాన కెమెరా జతగా 8MP కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ AI సపోర్ట్ తో మంచి కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ జిటి 30 ప్రో 5500 mAh బ్యాటరీ మరియు 45W ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :