160 W ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్లతో అదరగొట్టనున్న ఇన్ఫినిక్స్

Updated on 16-Jul-2021
HIGHLIGHTS

కస్టమర్లను ఆకర్షించే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్

కస్టమర్లను ఆకర్షించే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్

160W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ ఫోన్

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లలో ఇన్ఫినిక్స్ కూడా ఒకటి. ఇన్ఫినిక్స్ బ్రాండ్ కేవలం బడ్జెట్ ధరలోనే  కస్టమర్లను ఆకర్షించే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ అందిస్తున్న సంస్థగా నిలిచింది. అయితే, ఇప్పుడు ఇన్ఫినిక్స్ బ్రాండ్ అందరిని ఆశ్చర్యపరుస్తూ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ ఇన్ఫినిక్స్ బ్రాండ్ కేవలం బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మాత్రమే తన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లకి విడుదల చేసింది. కానీ, ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం మార్కెట్లో మంచి పోటీదారుగా కూడా నిలవాలని యోచిస్తున్నట్లు అనిపిస్తోంది.

ఎందుకంటే, ఇన్ఫినిక్స్ 160W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్ ప్రకటించింది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 10 నిముషాల్లోనే ఫోన్ 100% పూర్తిగా చార్జింగ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇన్ఫినిక్స్ యొక్కఅధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :