శామ్సంగ్ గెలాక్సీ M32 ధర పైన రూ.2,000 భారీ తగ్గింపు..!!

శామ్సంగ్ గెలాక్సీ M32 ధర పైన రూ.2,000 భారీ తగ్గింపు..!!
HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ M32 పైన రూ.2,000 భారీ తగ్గింపు

ప్రైస్ కట్ తరువాత గెలాక్సీ M32 చాలా తక్కువ ధరకే లభిస్తోంది

శామ్సంగ్ గెలాక్సీ M32 కొత్త ధర వివరాలు

శామ్సంగ్ బడ్జెట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ M32 పైన రూ.2,000 భారీ తగ్గింపు ను శామ్సంగ్ ప్రకటించింది. ఈ ప్రైస్ కట్ తరువాత శామ్సంగ్ గెలాక్సీ M32 స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చవక ధరలో 90Hz రిఫ్రెష్ రేట్ సూపర్ AMOLED డిస్ప్లే, మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ మరియు 6000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లు కలిగిన శామ్సంగ్ ఫోన్ గా నిలుస్తుంది. ప్రైస్ కట్ తరువాత, శామ్సంగ్ గెలాక్సీ M32 కొత్త ధర వివరాలు మరియు ఫీచర్లను క్రింద చూడవచ్చు. 

Samsung Galaxy M32 : ధర

గెలాక్సీ M32 5G బేసిక్ వేరియంట్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 రూపాయలు. అలాగే, 6జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధరకే వస్తుంది. Buy From Here

Samsung Galaxy M32 : స్పెసిఫికేషన్స్

ఈ శాంసంగ్ ఫోన్ 6.4 అంగుళాల FHD+ ఇన్ఫినిటీ U డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ Helio G80 SoC తో పనిచేస్తుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం32 5 స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది.

ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది మరియు ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 20ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

గెలాక్సీ M32 స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది. అయితే, ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను పవర్ బటన్‌తో క్లబ్ చేసి సైడ్‌లో ఇచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo