మరికొద్ది సేపట్లో ఇండియాలో లాంచ్ కానున్న REALME X2 PRO : live చూడండి ఇలా

HIGHLIGHTS

ఒక 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో తీసుకొచ్చింది.

రియల్మీ సంస్థ,  ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండియాలో గోప్ప ఫీచర్లతో లాంచ్ చేయనున్న REALME X2 PRO కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. క్వాల్కామ్ యొక్క ప్రధాన ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 855+ SoC, ఒక ప్రధాన 64MP క్వాడ్ కెమేరాతో పాటుగా అత్యంత వేగంగా ఫోన్ను ఛార్జ్ చేయగల ఒక 50W ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ను లాంచ్ చేయనుంది. ఇక ఈ కార్యక్రమాన్ని నేరుగా LIVE చూడాలనుకున్నవారు, ఈ క్రింద చూడవచ్చు.

రియల్మి ఎక్స్ 2 ప్రో : ప్రత్యేకతలు

ఈ రియల్మీ ఎక్స్ 2 ప్రో  ఫోనులో  ఒక ప్రధాన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్‌ సెట్ ఇవ్వబడింది. ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోనులోఒక 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కూడా పొందుతారు. అంతేకాదు, ఈ డిస్ప్లేని FHD + రిజల్యూషన్‌తో అందించింది. ఈ మొబైల్ ఫోన్‌లో, మీరు వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే 90 Hz రిఫ్రెష్ రేట్‌ స్క్రీన్‌ను అందుకుంటారు మరియు  ఇది లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ముఖ్యంగా, ఇది ఒక 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో తీసుకొచ్చింది.

కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్‌లో మీకు క్వాడ్-కెమెరా సెటప్ లభిస్తోంది, ఇందులో మీకు 64 MP  ప్రధాన కెమెరా లభిస్తోంది, ఇది కాకుండా మీరు 8MP  అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ తో పాటుగా  ఒక 13MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కూడా పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్‌ను కూడా అందించింది    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :