ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం Whatsapp ఫింగర్ ప్రింట్ లాక్ : ఇలా సెట్ చేయండి

Updated on 04-Nov-2019
HIGHLIGHTS

ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా 'ఫింగర్ ప్రింట్ లాక్' ఫీచరును అందించింది.

వాట్స్ యాప్ లో ఫిగేర్ ప్రింట్ లాక్ తేనున్నట్లు ముందుగా ప్రకటించినట్లుగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ Finger Print Lock  అప్డేట్ ను అందించింది. వినియోగదారుల ప్రైవసీని మరింత భద్రంగా జాగ్రత్త చేయడానికి ఫింగర్ ప్రింట్ లాక్ తో పాటుగా మరెన్నో కొత్త ఫీచర్లను కూడా వాట్స్ ఆప్ తీసుకొచ్చింది.  ముందుగా,  టచ్ ID మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను ఐఫోన్ వినియోగదారులకు తీసుకొచ్చిన సంస్థ, ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా 'ఫింగర్ ప్రింట్ లాక్' ఫీచరును అందించింది.

దీనితో, కేవలం మీరు మాత్రమే మీ వాట్స్ ఆప్ మెసేజిలు  మరియు డేటాని చూడవచ్చు. మీ ఫింగర్ ప్రింట్ లేకుండా వేరేవారు మీ వాట్స్ ఆప్ ఓపెన్ చేసే అవకాశముండదు. దీన్ని మీ ఫోనులో సెట్ చేసుకోవడానికి, మీ వాట్స్ ఆప్ లోని Settings లోకి వెళ్లి అందులోని Account ని సెలెక్ట్ చేసిన తరువాత  Privacy ని సెలెక్ట్ చేసుకోవాలి.

తరువాత, ఈ ప్రైవసీలో అడుగు భాగాన Finger Print Lock అనే ఎంపిక కనిపిస్తుంది, దానిపైన నొక్కగానే మీకు Unlock With FingerPrint అనే అప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయగానే మీ ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మీ ఫింగర్ ప్రింట్ నమోదు చేయగానే, మీ అకౌంట్ ఇక కేవలం మీ ఫింగర్ ప్రింట్ తో మాత్రమే తెరుచుకుంటుంది.   

దీని షాట్ కట్ లో చెప్పాలంటే,  Settings > Account > Privacy > Finger Print Lock

ఈ అప్షన్ తో, ఇక మీ కొత్త తరం సెక్యూరిటీని పొందవచ్చు .                 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :