Honor 9Xc 5G launch date and features revealed
Honor X9c 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ఈరోజు హానర్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను డ్రాప్, హాట్ మరియు వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు హానర్ ఈ ఫోన్ గురించి గొప్పగా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.
హానర్ ఎక్స్9c స్మార్ట్ ఫోన్ ను జూలై 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లాంచ్ అవుతుంది మరియు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది.
ఈ హానర్ స్మార్ట్ ఫోన్ స్లిమ్ టైటానియం డిజైన్ తో కేవలం 7.98mm మందంతో స్లిమ్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 6600 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 66W ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఇండస్ట్రీ లీడింగ్ 2 మీటర్ డ్రాప్ అల్ట్రా టఫ్ డిజైన్ తో ఉంటుంది. అంతేగాదు, IP65M రేటెడ్ 360 డిగ్రీల వాటర్ రెసిస్టెంట్ తో మరింత ఆకట్టుకుంటుంది.
ఈ ఫోన్ 1.5 రిజల్యూషన్ కలిగిన క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు DCI P3 సినిమాటిక్ వైడ్ కలర్ గాముట్ తో వస్తుంది. ఈ ఫోన్ 108MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.
Also Read: విలక్షణమైన డిజైన్ తో విడుదలైన Nothing Headphone 1 ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్ట్ తో వస్తుంది. ఇది 3x లాస్ లెస్ జూమ్ మరియు 9 ఇన్ వన్ పిక్సెల్ ఫీచర్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ కూడా అందించింది.
ఈ ఫోన్ మ్యాజిక్ OS 9.0 తో నడుస్తుంది. ఇందులో 300% గొప్ప సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.