Honor X7c 5G: ప్రీమియం లుక్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

Updated on 18-Aug-2025
HIGHLIGHTS

హానర్ ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ ఎక్స్ 7c 5జి ఫోన్ లాంచ్ చేసింది

బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో భారత మార్కెట్లో అడుగుపెట్టింది

ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ ఫీచర్ తో స్ట్రాంగ్ గా ఉంటుంది

Honor X7c 5G: ప్రముఖ చైనీస్ కంపెనీ హానర్ ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ ఎక్స్ 7c 5జి ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మంచి లుక్స్ కలిగిన ప్రీమియం డిజైన్ మరియు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో భారత మార్కెట్లో అడుగుపెట్టింది. హానర్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.

Honor X7c 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్

హానర్ ఈ ఫోన్ ను సింగల్ వేరియంట్ తో రూ. 14,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు మూన్ లైట్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ అవుతుంది.

Honor X7c 5G: ఫీచర్స్

ఈ హానర్ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ మరియు మార్బుల్ వంటి రెండు డిజైన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ ఫీచర్ తో స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP 64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ హానర్ ఫోన్ స్లీక్ డిజైన్ లో కూడా 5200 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేసే 35W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

హానర్ ఎక్స్ 7c స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ బిగ్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు మంచి 850 నిట్స్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా ఇందులో 8 జీబీ ఫిజికల్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 256 జీబీ అంతర్గత హెవీ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ చాలా వేగంగా ఉంటుందని హానర్ ప్రకటించింది.

Also Read: Motorola Collections: క్రిస్టల్స్ పొదిగిన ప్రీమియం ఫోన్ లాంచ్ చేస్తున్న మోటోరోలా.!

ఇక కెమెరా మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP AI మోషన్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ 3x లాస్ లెస్ జూమ్ మరియు మంచి AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. హానర్ X7c ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 300% హై వాల్యూమ్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఎక్కువ సమయం బ్యాటరీ నిలపడానికి వీలుగా అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. ఈ ఫోన్ లో కూడా హానర్ మ్యాజిక్ క్యాప్సూల్ ని అందించింది. ఇది మల్టీ టాస్కింగ్ కోసం చక్కగా ఉపయోగపడుతుంది.

హానర్ ఎక్స్ 7c ఫీచర్స్ ఏమిటి?

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్
  • 16 జీబీ ర్యామ్ (8 జీబీ + 8 జీబీ) + 256 జీబీ స్టోరేజ్
  • SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ బాడీ
  • 50MP AI మోషన్ కెమెరా (3x లాస్ లెస్ జూమ్)
  • 5200 mAh బ్యాటరీ మరియు 35W ఫాస్ట్ ఛార్జ్
  • IP 64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్
  • 300% హై ఇంపాక్ట్ సౌండ్ సపోర్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :