Honor X Series india launch announced
Honor X Series ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసింది హానర్. గత సంవత్సరం ఇండియాలో హానర్ 200 5G సిరీస్ ఫోన్ లను విడుదల చేసిన హానర్, ఇప్పుడు హానర్ X సిరీస్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రత్యేకతలు వివరించేలా టీజర్ ఇమేజ్ మరియు పోస్ట్ లను కూడా విడుదల చేసింది. హానర్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుందో కూడా కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది.
హానర్ ఎక్స్ సిరీస్ ను త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ ని హానర్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ‘Coming Soon’ ట్యాగ్ తో ఈ అప్ కమింగ్ ఫోన్ సిరీస్ టీజర్ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో 12 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ Smart Tv.!
ఈ హానర్ ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ వెల్లడయ్యాయి. ఈ ఫోన్ లను డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో అందిస్తోంది. ఈ ఫోన్ కెమెరా సెటప్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్లు హై క్వాలిటీ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తాయని హానర్ తెలిపింది.
హానర్ ఎక్స్ సిరీస్ ఫోన్ లను పెద్ద మరియు పవర్ ఫుల్ బ్యాటరీతో పాటు వేగవంతమైన ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు కూడా హానర్ చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లలో ఐ ఫ్రెండ్లీ మరియు వైబ్రాంట్ బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే తో అందించబోతున్నట్లు కూడా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లలో కర్వుడ్ డిస్ప్లే ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని మరిన్ని కీలకమైన ఫీచర్స్ తో పాటు లాంచ్ డేట్ కూడా త్వరలోనే అందిస్తుందని కూడా హానర్ చెబుతోంది.