Honor Robot Phone గురించి ఎవరికీ తెలియని ప్రత్యేకమైన ఫీచర్స్.. తెలుసుకోండి.!

HIGHLIGHTS

Honor Robot Phone కోసం చాలా కాలంగా టీజింగ్ చేసిన హానర్

MWC 2026 బిగ్ ఈవెంట్ నుంచి హానర్ రోబోట్ ఫోన్ ఆవిష్కరించింది

ఈ ఫోన్ గురించి గురించి ఎవరికీ తెలియని ప్రత్యేకమైన ఫీచర్స్ ఈరోజు మీరు తెలుసుకోండి

Honor Robot Phone కోసం చాలా కాలంగా టీజింగ్ చేసిన హానర్ ఈ ఫోన్ ను MWC 2026 బిగ్ ఈవెంట్ నుంచి ఆవిష్కరించింది. ఇప్పటి వరకు సాధారణ ఫోన్లు మాత్రమే ఉపయోగించిన ప్రపంచానికి ఈ కొత్త స్మార్ట్‌ ఫోన్ తో సరికొత్త యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఇది ఇది కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు రోబోటిక్స్ సమ్మేళనంతో పని చేసే అత్యాధునికమైన స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ గురించి గురించి ఎవరికీ తెలియని ప్రత్యేకమైన ఫీచర్స్ ఈరోజు మీరు తెలుసుకోండి.

Honor Robot Phone : ఏమిటి ఈ ఫోన్?

హానర్ రోబోట్ ఫోన్ అనేది హానర్ కొత్తగా ఆవిష్కరించిన రోబోట్ స్మార్ట్ ఫోన్ మరియు ఇది MWC 2026 నుంచి రివీల్ చేయబడింది. MWC 2026 నుంచి నిన్న హానర్ మ్యాజిక్ V6 ఫోన్ తోపాటు ప్రపంచాన్ని అబ్బురపరిచే హానర్ రోబోట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ సాధారణ ఫోన్స్ మాదిరిగా కాకుండా పూర్తి ఆటోమాటిగ్గా పని చేసే ఫోన్ + రోబోట్ లాంటి ఫంక్షనాలిటీ తో ఉంటుంది. ఇది చూడటానికి హాలీవుడ్ సినిమా Wall-E మాదిరిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో రోబో చేసినట్లు ఈ ఫోన్ లో ఉండే పాప్ అప్ కెమెరా పని చేస్తుంది.

Honor Robot Phone : ఫీచర్స్

హానర్ రోబోట్ ఫోన్ మొత్తంగా ఫోన్ + రోబోట్ లాంటి ఫంక్షనాలిటీలను సమ్మిళితం చేస్తుంది. ఈ ఫోన్ యూజర్ ఐకానిక్ జెశ్చర్స్ మరియు మూమెంట్స్ ద్వారా ఫోన్‌ను కంట్రోల్ చేయగలిగే శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో వాయిస్ అండ్ మోషన్ డిటెక్షన్ ఆధారిత యాక్సెస్ కూడా ఉంటుంది. హానర్ గత మోడల్స్ మాదిరిగా కాకుండా ఇందులో సరికొత్త AI ఇంటిగ్రేటెడ్ OS ని అందిస్తుంది.

ఈ ఫోన్ లో ఉన్న ప్రత్యేకమైన రోబోట్ కెమెరా ఈ ఫోన్ లో ఉన్న ప్రత్యేక ఆకర్షణ. ఈ రోబోట్ కెమెరా ఆబ్జెక్ట్స్ ట్రాక్ చేయడమే కాకుండా స్పాంటేనియస్ గా సమాదానాలు చెబుతుంది మరియు దానికి అనుగుణంగా మూమెంట్స్ కూడా చేస్తుంది. ఇందులో ఉన్న AI-పవర్డ్ ఆపరేటింగ్‌ సిస్టమ్ యూజర్ ఆట్స్, పనులు, షెడ్యూల్ లను అర్థం చేసుకొని ముందుగానే సూచన చేస్తుంది. వాయిస్ కమాండ్ అర్థం చేసుకొని పనులు తేలికగా అమలు చేయడం మరియు మల్టీ టాస్క్ అటానమీ తో ఆటోమేటిక్ గా యాప్‌లను మల్టీ టాస్క్ చేస్తుంది.

ఈ ఫోన్‌లో అవసరమైన జెశ్చర్ అండ్ మోషన్ బేస్డ్ నావిగేషన్ ఇవ్వవచ్చు. ఇందులో స్క్రోల్ కోసం హ్యాండ్ ఫ్లిక్, కాల్స్ ఆన్సర్ చేయడానికి గాల్లో స్వీప్ చేయడం మరియు మోషన్ బేస్డ్ వాయిస్ కంట్రోల్స్ ఉంటాయని చెబుతున్నారు.

Also Read: Happy Holi 2026: బెస్ట్ విషెస్ మరియు బెస్ట్ ఇమేజెస్ ఇవిగో.!

ఇక ఈ ఫోన్ కలిగి ఉండొచ్చని చెబుతున్న మరిన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. అదేమిటంటే, ఈ ఫోన్ లో XR (ఎక్స్టెండెడ్ రియాలిటీ) సపోర్ట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే, AR Gaming, వర్చువల్ అసిస్టెన్స్ ఇన్ రియర్ టైమ్ మరియు హ్యాండ్స్ ఫ్రీ ఇంటరాక్షన్ వంటి అదనపు హనుగులు కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ గురించి పూర్తి స్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫోన్ గురించి తెలుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :