హానర్ 9x ప్రో గూగుల్ సపోర్ట్ లేకుండా విడుదలయ్యింది.

హానర్ 9x ప్రో గూగుల్ సపోర్ట్ లేకుండా విడుదలయ్యింది.

హానర్ భారతదేశంలో తన Honor 9 X Pro ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను రూ .17,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క ప్రత్యేక ఫీచర్లలో హిసిలికాన్ కిరిన్ 810 ప్రాసెసర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా వంటివి ఉన్నాయి. అలాగే, ఫాంటమ్ పర్పుల్ మరియు మిడ్నైట్ బ్లాక్ అనే రెండు రంగులఎంపికల్లో ఫ్లిప్‌కార్ట్ అమ్ముడవనున్నది. 

హానర్ 9 ఎక్స్ మరియు 9 ఎక్స్ ప్రో లను గత ఏడాది జూలైలో చైనాలో విడుదల చేశారు. 2020 జనవరిలో కంపెనీ హానర్ 9 ఎక్స్ ను భారతదేశంలో విడుదల చేసింది, ఇప్పుడు ప్రో వేరియంట్ కూడా విడుదల చేసింది.

హానర్ 9 ఎక్స్ ప్రో : Sale వివరాలు

హానర్ 9 ఎక్స్ ప్రో త్వరలో అమ్మకానికి రానుంది మరియు వినియోగదారులు మే 21 నుండి 22 వరకు జరిగే ప్రత్యేక ప్రారంభ యాక్సెస్ అమ్మకంలో కూడా పాల్గొనవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ‌లో అమ్మకం కోసం రిజిస్ట్రేషన్ మే 12 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో, రిజిస్టర్డ్ కస్టమర్లు రూ .3,000 డిస్కౌంట్ పొందవచ్చు మరియు నో కాస్ట్ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. 3 నెలల లోపు ప్రమాదవశాత్తు దెబ్బతిన్న కూడా వినియోగదారులకు ఒక సారి ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ లభిస్తుంది.

హానర్ 9 ఎక్స్ ప్రో : ప్రత్యేకతలు

హానర్ 9 ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ 1080 × 2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌ కలిగిన ఒక 6.59-అంగుళాల FHD+ డిస్ప్లే తో వస్తుంది మరియు 391 PPI పిక్సెల్స్ డెన్సిటీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, హువావే యొక్క హిసిలికాన్ కిరిన్ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 6GB RAM మరియు 256GB స్టోరేజితో జత చేయబడింది. ఒక మైక్రో SD కార్డ్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టోరేజిని 512GB కి పెంచవచ్చు.

హానర్ 9 ఎక్స్ ప్రో మూడు కెమెరా సెన్సార్లతో వస్తుంది. ప్రాధమిక లెన్స్ 48MP సెన్సార్ మరియు దాని ఎపర్చరు f / 1.8. ఇది కాకుండా, రెండవది 8MP మెగాపిక్సెల్ సెన్సార్ మరియు మూడవది 2MP డెప్త్ సెన్సార్ అవుతుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 16 MP పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా  ఉంది.

భారతదేశంలో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్స్ కోసం ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ గ్యాలరీతో వచ్చిన, హానర్ సంస్థ యొక్క మొట్టమొదటి  ఫోన్ ఈ హానర్ 9 ఎక్స్ ప్రో అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్, గూగుల్ ప్లే స్టోర్ లేదా గూగుల్ యాప్స్ మరియు యూట్యూబ్, జిమెయిల్, గూగుల్ మ్యాప్స్ వంటి సేవలను అందించదు. ఈ స్మార్ట్ ఫోన్, హువావే యాప్స్ మరియు సర్వీస్ లను అందిస్తుంది. హానర్ 9 ఎక్స్ ప్రో సంస్థ యొక్క EMUI 9.1.1 పై పనిచేస్తుంది, ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo