Honor 7X Red Edition భారత్ లో లాంచ్ , ధర Rs. 12,999

Honor 7X Red Edition భారత్ లో లాంచ్ , ధర  Rs. 12,999

కంపెనీ భారతదేశం లో Honor 7X యొక్క కొత్త వేరియంట్ ని  ప్రవేశపెట్టింది. నిజానికి ప్రస్తుతం Honor 7X  రెడ్ ఎడిషన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో  ప్రవేశపెట్టబడింది.  ధర రూ.12.999. ఈ వేరియంట్ లభ్యత గురించి ప్రస్తుతం సమాచారం లేదు. ఈ ఫోన్ ముందుగా బ్లాక్, బ్లూ మరియు గోల్డ్ రంగులు మాత్రమే లభించింది.

Honor 7X లో లభ్యమయ్యే ఫీచర్స్ ని  చూడండి, ఇది ఒక 5.93 అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 2160 x 1080p యొక్క రిజల్యూషన్తో వస్తుంది. ఈ డివైస్  కిరిన్ 659 చిప్సెట్, 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చబడింది. ఈ హ్యాండ్ సెట్ మైక్రో SD కార్డ్ స్లాట్ కి  మద్దతు ఇస్తుంది.

Honor 7X ఒక 16MP + 2MP డ్యూయల్  వెనుక కెమెరా సెటప్ ని  కలిగి ఉంది మరియు దాని ముందు ఒక 8MP కెమెరా ఉంది. ఈ హ్యాండ్సెట్ Android 7.0 నౌగాట్  EMUI 5.1 తో నడుస్తుంది.

ఈ డివైస్ కి రియర్ -మౌంట్ చేయబడిన ఫింగెర్ప్రింట్  సెన్సార్ ఉంది. ఈ డివైస్  3340 mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఈ డివైస్  ఛార్జింగ్ కోసం మైక్రో  USB పోర్ట్ ని  ఉపయోగిస్తుంది.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo