HMD Vibe2 5G vs iQOO Z11 Lite 5G vs AI+ Nova 2 Power 5G బడ్జెట్ ధరలో ఏ ఫోన్ బెస్ట్.!
HMD Vibe2 5G vs iQOO Z11 Lite 5G vs AI+ Nova 2 Power 5G బడ్జెట్ ధరలో ఏ ఫోన్ బెస్ట్
ఈ మూడు ఫోన్లు ప్రస్తుతం భారత మార్కెట్ లో ఆసక్తికరమైన ఆప్షన్లుగా ఉన్నాయి
ఈ మూడు ఫోన్లలో బడ్జెట్ ధరలో ఏ ఫోన్ బెస్ట్ అవుతోందో చూద్దాం
HMD Vibe2 5G vs iQOO Z11 Lite 5G vs AI+ Nova 2 Power 5G బడ్జెట్ ధరలో ఏ ఫోన్ బెస్ట్ అవుతుందో ఈరోజు చుడనున్నాము. బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి HMD, iQOO, AI+ బ్రాండ్ల నుంచి వచ్చిన మూడు ఫోన్లు ప్రస్తుతం భారత మార్కెట్ లో ఆసక్తికరమైన ఆప్షన్లుగా ఉన్నాయి. హెచ్ఎండి వైబ్ 2 5G, ఐకూ Z11 లైట్ 5G మరియు AI+ నోవా 2 పవర్ మూడు 5G ఫోన్లు కూడా పెద్ద బ్యాటరీ, 120Hz డిస్ప్లే మరియు 5G కనెక్టివిటీతో ఆకట్టుకుంటాయి. అయితే, వీటి ధర, ప్రాసెసర్, కెమెరా మరియు ఛార్జింగ్ ఫీచర్లో తేడాలున్నాయి. మరి ఈ మూడు ఫోన్లలో బడ్జెట్ ధరలో ఏ ఫోన్ బెస్ట్ అవుతోందో చూద్దాం.
HMD Vibe2 5G vs iQOO Z11 Lite 5G vs AI+ Nova 2 Power 5G : ప్రైస్
హెచ్ఎండి వైబ్ 2 5G ఫోన్ బేసిక్ వేరియంట్ రూ.14,999 ధరలో వస్తుంది. ఐకూ Z11 లైట్ 5G రూ.17,499 ప్రారంభ ధరలో వస్తుంది. ఇక AI+ నోవా 2 పవర్ 5G ప్రైస్ విషయానికి వస్తే ఈ ఫోన్ ధర రూ.16,999 నుంచి ప్రారంభమవుతుంది.
స్క్రీన్
హెచ్ఎండి వైబ్ 2 5G ఫోన్ లో 6.75 అంగుళాల HD+ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఐకూ Z11 లైట్ 5G ఫోన్ 6.74 అంగుళాల HD+ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. AI+ నోవా 2 పవర్ 5G ఫోన్ కూడా 6.75 అంగుళాల HD+ 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది.
ప్రాసెసర్
పనితీరు విషయానికి వస్తే, హెచ్ఎండి వైబ్ 2 5G ఫోన్ లో Unisoc T8200 ప్రాసెసర్ ఉంది. ఐకూ Z11 లైట్ 5G ఫోన్ లో మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో నడుస్తుంది. AI+ నోవా 2 పవర్ 5G ఫోన్ లో ఈ రెండు ఫోన్స్ కంటే మెరుగైన మీడియాటెక్ Dimensity 7100 ప్రాసెసర్ ఉండటం విశేషం. అంతేకాదు, హెచ్ఎండి వైబ్ 2 5G మరియు ఐకూ Z11 లైట్ 5G కేవలం 4జీబీ ర్యామ్ మాత్రమే కలిగి ఉంటే, AI+ నోవా 2 పవర్ 5G ఫోన్ మాత్రం 6 జీబీ ర్యామ్ తో వస్తుంది. మీ మూడు ఫోన్స్ లో ఐకూ ఫోన్ 64 జీబీ తక్కువ స్టోరేజ్ ఉంది.
కెమెరా
కెమెరా విభాగానికి వస్తే, HMD ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా అండ్ 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. iQOO ఫోన్ లో 50MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా లభిస్తాయి. AI+ ఫోన్ లో 48MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్
బ్యాటరీ విషయంలో AI+ నోవా 2 పవర్ ఫోన్ ముందంజలో నిలుస్తుంది. ఇందులో 7,000mAh బ్యాటరీ మరియు 33W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. iQOO ఫోన్ 6,500mAh బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. HMD ఫోన్ లో 6,000mAh బ్యాటరీ మరియు 18W ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది.
ఏది కొనాలి?
మీరు తక్కువ ధరలో 5G ఫోన్ కోరుకుంటే HMD వైబ్ 2 5G ఫోన్ పరిశీలించవచ్చు. వేగవంతమైన ఛార్జింగ్ కోరుకుంటే ఐకూ Z11 లైట్ 5G మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద బ్యాటరీ, మెరుగైన ప్రాసెసర్, అల్ట్రా వైడ్ కెమెరా కావాలనుకునే వారికి AI+ నోవా పవర్ 5G ఫోన్ మంచి ఎంపికగా కనిపిస్తోంది.
అయితే, కొనుగోలు ముందు లేటెస్ట్ ప్రైస్ మరియు మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సపోర్ట్ వివరాలు పరిశీలించడం మంచిది.