Rs.10,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోండి

Rs.10,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోండి
HIGHLIGHTS

నేటి కాలంలో, ఒక మంచి స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయడానికి అధిక ధరను చెల్లించాల్సిన అవసరం లేదు.

మీరు కేవలం బడ్జెట్ ధరలోనే ఒక స్మార్ట్ చిప్సెట్, AI- డ్యూయల్ వెనుక కెమెరా, వేలిముద్ర సెన్సార్, స్మార్ట్ బ్యాటరీ మరియు ఫేస్ అన్లాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన కొన్నిబెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాను.

నేటి కాలంలో, ఒక మంచి స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయడానికి అధిక ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కేవలం బడ్జెట్ ధరలోనే ఒక స్మార్ట్ చిప్సెట్, AI- డ్యూయల్ వెనుక కెమెరా, వేలిముద్ర సెన్సార్, స్మార్ట్ బ్యాటరీ మరియు  ఫేస్ అన్లాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో, అనేక కంపెనీలు అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. చెప్పాలంటే, వీటిలో షావోమి పేరు టాప్ ప్లేస్ లో నిలుస్తుంది మరియు ప్రస్తుతం శామ్సంగ్ కూడా షావోమితో పోటీ పడటానికి మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్లను విడుదలచేసింది. అందుకోసమే,  కేవలం 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయదగిన  కొన్నిబెస్ట్  స్మార్ట్ ఫోన్లను  ఇక్కడ అందిస్తున్నాను.

1. రెడ్మి నోట్ 7

ఇటీవల భారతదేశంలో మంచి స్పెక్స్ తో, 10,000 రూపాయల కంటే తక్కువధరలో షావోమి నుండి వచ్చినటువంటి స్మార్ట్  ఫోనుగా, ఈ రెడ్మి నోట్ 7 గురించి చెప్పొచ్చు. ఇది ముందు మరియు వెనుకా కూడా ఒక గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది మరియు ఒక 2.2GHz వద్ద క్లాక్ చెయ్యబడిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ప్రొసెసరుతో మంచి పెరఫార్మెన్సు అందిస్తుంది. అలాగే, ఇందులో 12MP +2MP AI డ్యూయల్ కెమేరా, 13MP గొప్ప సెల్ఫీ కెమెరా మరియు 4000mAh వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్ తో అందుబాటులో వుంది.

2.  శామ్సంగ్ గెలాక్సీ M 20

శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప స్పెక్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్లను కేవలం బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చింది.  సరికొత్తగా వచ్చిన ఈ శామ్సంగ్ గెలాక్సీ M 20 స్మార్ట్ ఫోన్,  13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.3 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  5000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

3. శామ్సంగ్ గెలాక్సీ M 10

శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ M 10 స్మార్ట్ ఫోన్, 13MP +5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్  ఒక 6.22 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

4.  అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2

ఈ Max Pro M2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 OS తో పనిచేస్తుంది మరియు వెనుక భాగంలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్నాప్ డ్రాగన్ 660 ప్రోసెసరుకి జతగా అడ్రినో 512 గ్రాఫిక్స్ మరియు 3GB ర్యామ్ తో శక్తివంతంగా ఉంటుంది. ఇది వెనుక 12+5MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 13MP సెన్సారును కలిగి ఉంటుంది.

5. రెడ్మి Y3

షావోమి సంస్థ నుండి కేవలం రూ.9,999 ధరలో 32MP సెల్ఫీ కెమేరాతో ఇండియాలో విడుదల చేయబడినటువంటి, ఈ REDMI Y3 స్మార్ట్ ఫోన్, 1.8 GHz వద్ద క్లాక్ చేయబడిన,  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తికి జతగా 3GB/4GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 32GB/64GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 12+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక 32MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరతో లభిస్తుంది మరియు దీని యొక్క మరొక సేల్ జూన్ 4 వ తేది 12గంటలకి mi.com మరియు అమేజాన్ నుండి జరగనుంది.

6. రియల్మీ C2

ఇటీవల, రియల్మీ సంస్థ విడుదల చేసినటువంటి ఈ రియల్మీ C2 , 2GHz వద్ద క్లాక్ చేయబడిన, మీడియా టెక్ హీలియో P22ప్రాసెసర్ శక్తికి జతగా 2GB/3GB ర్యామ్ తో జతగా వస్తుంది. ఇది 16GB/32GB స్టోరేజిని కలిగి ఉంటుంది. ఇది 13+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరాతో పాటుగా ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5,999 ప్రారంభ ధరతో లభిస్తుంది మరియు దీని యొక్క మరొక ఫ్లాష్ సేల్, జూన్ 7వ తేది మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది.

7. రియల్మీ 3

రియల్మీ సంస్థ నుండి కేవలం రూ. 8,999 ధరలో డ్యూయల్  కెమెరాలతో, ఇటీవల ఇండియాలో లాంచ్ చేయబడినటువంటి ఈ రియల్మీ 3 స్మార్ట్ ఫోన్, ఒక 6.22 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది.  ఇది ఒక  మీడియా టెక్ హీలియో P70 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఇది 3GB ర్యామ్ మరియు 64GB అంతర్గత మెమొరీతో వస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క మెమొరీని 256GB వరకు పెంచుకోవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo