పవర్ ఫుల్ ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా.!

HIGHLIGHTS

పవర్ ఫుల్ ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ స్మార్ట్ ఫోన్ అనేక ప్రీమియం ఫీచర్లను తనలో ఇముడ్చుకుంది

pOLED డిస్ప్లే మొదలుకొని 3D Dolby Atmos వరకూ అనేక ఫీచర్లను ఈ ఫోన్ కలిగివుంది

పవర్ ఫుల్ ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా. అదే, మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ అనేక ప్రీమియం ఫీచర్లను తనలో ఇముడ్చుకుంది. 144Hz రిఫ్రెష్ రేట్ pOLED డిస్ప్లే మొదలుకొని 3D Dolby Atmos వరకూ అనేక ఫీచర్లను ఈ ఫోన్ కలిగివుంది. Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ అందుబాటులోకి రానుంది. అందుకే, లేటెస్ట్ ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలను ఇక్కడ అందించాను.    

Motorola Edge 30 Fusion: Price

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ ఫోన్ 8జిబి మరియు 128జిబి స్టోరేజ్ తో రూ.42,999 రూపాయల ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 22 నుండి సేల్ అవుతుంది మరియు Flipkart బిగ్ బిలియన్ డేస్ నుండి ఈ ఫోన్ రూ.39,999 ధరతో సేల్ అవుతుంది. ఈ సేల్ నుండి మరిన్ని బ్యాంక్ మరియు ఇతర ఆఫర్లను పొందే వీలుంది.

Motorola Edge 30 Fusion: స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్ 6.55 ఇంచ్ FHD+ రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ pOLED డిస్ప్లే. ఈ స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 888+ ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ ఇంటర్ కాస్మిక్ గ్రే మరియు సోలార్ గోల్డ్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఎడ్జ్ 20 ఫ్యుజన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ కెమెరా సెటప్ లో  OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరాకి జతగా 13 అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఈ కెమెరాతో అల్ట్రా రిజల్యూషన్ ఫోటోలను మరియు వీడియోలనుచిత్రీకరించ వచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది మరియు ఈ కెమెరాతో RAW మరియు HDR ఫోటోలను పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ లో 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,400 mAh బ్యాటరీని అందించింది. ఇక ఇతర ఫీచర్ల విషయాన్ని వస్తే, ఈ ఫోన్ లో యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కలిగిన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంది. ఈ ఫోన్ IP52 వాటర్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు ఆన్ స్క్రీన్ ఫింగర్  ప్రింట్ సెన్సార్ ని కూడా కలిగివుంది. ఆడియో పరంగా,  ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్ సెటప్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :