google rolled out Android 17 update for Pixel and Pixel Android 17 on trend
Pixel Android 17: గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కలిగిన వారికి గుడ్ న్యూస్ అందించింది గూగుల్. ముందుగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త అప్డేట్ అందుకునే పిక్సెల్ ఫోన్ యూజర్ల కోసం ఇప్పుడు కూడా గూగుల్ ఆండ్రాయిడ్ 17 OS అప్డేట్ ను రోల్ అవుట్ చేసింది. అంతేకాదు, కొత్త అప్డేట్ అందుకునే గూగుల్ పిక్సెల్ ఫోన్ లిస్ట్ కూడా రివీల్ చేసింది. గూగుల్ రిలీజ్ చేసిన కొత్త అప్డేట్ ఫీచర్స్ మరియు ఈ అప్డేట్ అందుకోనున్న పిక్సెల్ ఫోన్స్ లిస్ట్ పై ఒక లుక్కేద్దామా.
ముందుగా ఆండ్రాయిడ్ 17 అప్డేట్ అందుకోనున్న గూగుల్ పిక్సెల్ ఫోన్స్ లిస్ట్ చూద్దాం.
అంటే, గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ నుంచి గూగుల్ లేటెస్ట్ గా లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ వరకు ఆండ్రాయిడ్ 17 OS అప్డేట్ అందుతుంది. అయితే, మీ డివైజ్ లో ఈ అప్డేట్ అందుబాటులో ఉందొ లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
మీ గూగుల్ పిక్సెల్ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ సిస్టం ఎంచుకుని అందులో ఉన్న సాఫ్ట్ వేర్ అప్డేట్. చివరిగా, “Check for update” పై క్లిక్ చేసి మీ ఫోన్ కోసం అప్డేట్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయవచ్చు.
ఈ కొత్త ఫీచర్ తో యాప్ లను ఫ్లోటింగ్ విండోల రూపంలో తెరిచి, ఒకేసారి అనేక పనులు సులభంగా చేసుకోవచ్చు. అనుకూలత కోసం గూగుల్ ప్రత్యేకంగా అందించిన కొత్త ఫీచర్ గా చెబుతారు.
స్క్రీన్ రికార్డింగ్ చేస్తూనే సెల్ఫీ కెమెరా ద్వారా మీ ముఖ కవళికలు కూడా వీడియోలో చూపించే సౌకర్యమే ఈ కొత్త స్క్రీన్ రియాక్షన్స్ ఫీచర్. వీడియోలు మరియు కొత్త ట్రెండ్ సెట్ చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
వ్యక్తిగత డేటా రక్షణ కోసం గూగుల్ అందించిన కొత్త అప్డేట్ లో అధునాతన భద్రతా ఫీచర్లు అందించింది. అదనంగా, ఫోన్ చోరీ నిరోధక వ్యవస్థను కూడా ఈ అప్డేట్ భాగంగా జత చేసింది. ఈ ఫీచర్ తో యూజర్ కు ఫోన్ పై మరింత భద్రత లభిస్తుంది.
ఫోన్ ను మరింత వేగంగా మార్చడానికి ఈ కొత్త ఫీచర్ పరిచయం చేసినట్లు చెబుతున్నారు. ఈ ఫీచర్ తో యాప్ లు వేగంగా పనిచేయడం, బ్యాటరీ వినియోగం తగ్గడం మరియు RAM నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉండడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి.
Also Read: OnePlus N6: కొత్త సిరీస్ ఫోన్ ను భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్న వన్ ప్లస్.!
గూగుల్ జెమినీ ద్వారా ఫోన్ లో కొత్త AI ఫీచర్లు, స్మార్ట్ అసిస్టెన్స్, మెరుగైన ప్రొడక్టివిటీ మరియు వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని (Personalized Experience) అందించనున్నాయి. ఇది లేటెస్ట్ Ai అనుభూతిని అందిస్తుంది.