Google Pixel 9a స్మార్ట్ ఫోన్ పై గూగుల్ భారీ ఆఫర్లు అందుకోండి.!

Updated on 03-Jun-2025
HIGHLIGHTS

గూగుల్ తన అఫీషియల్ ఆన్లైన్ స్టోర్ నుంచి భారీ ఆఫర్లు అందించింది

Google Pixel 9a స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు గొప్ప డీల్స్ అందించింది

గూగుల్ అధికారిక ఆన్లైన్ స్టోర్ నుంచి గొప్ప ఈ డీల్స్ ఆఫర్ చేస్తోంది

తక్షణ క్యాష్ బ్యాక్ మరియు సూపర్ సేవర్ బండిల్స్ వంటి బెస్ట్ ఆఫర్లు గూగుల్ ఈ ఫోన్ పై అందించింది

Google Pixel 9a స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు గూగుల్ తన అఫీషియల్ ఆన్లైన్ స్టోర్ నుంచి భారీ ఆఫర్లు అందించింది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లో బేసిక్ ఫోన్ గా పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ను గూగుల్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై గూగుల్ రీసెంట్ గా లాంచ్ చేసిన గూగుల్ అధికారిక ఆన్లైన్ స్టోర్ నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. మరి గూగుల్ అందించిన ఆఫర్లు మరియు ఫోన్ ఫీచర్లు ఏమిటో తెలుసుకుందామా.

Google Pixel 9a : ఆఫర్స్

గూగుల్ ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం సింగల్ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను రూ. 49,999 ప్రైస్ తో ఇండియాలో విడుదల చేసింది మరియు ఈరోజు కూడా అదే ధరకు లిస్ట్ అయ్యింది. మరి ఈ ఫోన్ పైన అందించిన ఆఫర్లు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నా. గూగుల్ స్టోర్ నుంచి ఈ ఫోన్ పై గొప్ప వడ్డీ సేవింగ్ చేసే No Cost EMI ఆఫర్, తక్షణ క్యాష్ బ్యాక్ మరియు సూపర్ సేవర్ బండిల్స్ వంటి బెస్ట్ ఆఫర్లు గూగుల్ ఈ ఫోన్ పై అందించింది.

గూగుల్ స్టోర్ నుంచి గూగుల్ పిక్సెల్ ఫోన్ ను 24 నెల నో కాస్ట్ EMI ఆఫర్ తో తీసుకునే వారికి గరిష్టంగా రూ. 7,003 వరకు వడ్డీ సేవ్ అవుతుంది. ఒకవేళ ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్ తో పూర్తి పేమెంట్ తో కొనుగోలు చేస్తే రూ. 3,000 తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ తో బ్యాక్ కవర్ కొనే వారికి రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా ఫోన్ ఎక్స్ చేంజ్ సౌలభ్యం కూడా గూగుల్ అందించింది.

Also Read: Noise Buds X2: 140 గంటల ప్లే టైమ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న నోయిస్.!

Google Pixel 9a : ఫీచర్స్

గూగుల్ స్ ఫోన్ ను గూగుల్ Tensor G4 చిప్ సెట్ మరియు జతగా Titan M2 సెక్యూరిటీ చిప్ తో అందించింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.3 ఇంచ్ ఆక్టువా OLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లేలో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 60–120 Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR సపోర్ట్ మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో సూపర్ కెమెరా సపోర్ట్ ను గూగుల్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక 48MP వైడ్ మరియు 13 MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ OIS మరియు CLAF ఫీచర్స్ తో గొప్ప స్టేబుల్ మరియు ఫోకస్డ్ ఫొటోలు ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ టన్నుల కొద్దీ కెమెరా ఫీచర్లు మరియు 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5100 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది ఫాస్ట్ ఛార్జ్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :