Google Pixel 9a got big deals after Google Pixel 10a launch
Google Pixel 10a స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో గూగుల్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ లాంచ్ తో గత సిరీస్ ఫోన్ Google Pixel 9a ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో కొనాలని చేసేవారు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. అందుకే, ఈ బిగ్ డీల్స్ ను ఈరోజు అందిస్తున్నాము.
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 49,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 39,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను Flipkart SBI మరియు Flipkart Axis క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా మీకు అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 37,999 ధరలో అందుకోవచ్చు.
Also Read: లేటెస్ట్ Zebronics 5.1 Dolby సౌండ్ బార్ పై బెస్ట్ డీల్స్ అందించిన అమెజాన్.!
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ pOLED స్క్రీన్ తో వస్తుంది. ఇది గొరిల్లా గ్లాస్ 3 కవర్ రక్షణ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను ఫోన్ గూగుల్ Tensor G4 చిప్ జతగా టైటాన్ M2 కో ప్రోసెసర్ మరియు 8GB RAM అండ్ 256GB స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో వస్తుంది మరియు కొత్త అప్‌డేట్స్ అందుకుంటుంది.
ఈ గూగుల్ బడ్జెట్ ఫోన్ 48MP Quad PD డ్యూయల్ పిక్సెల్ ప్రధాన సెన్సార్ జతగా 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్స్ మరియు గూగుల్ జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ పిక్సెల్ ఫోన్ 5,100mAh బిగ్ బ్యాటరీని ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ తో పాటు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా కలిగి ఉంటుంది.