Google Pixel 8a పై ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డీల్: చవక ధరకే ఫోన్ అందుకోండి.!

Updated on 01-May-2025
HIGHLIGHTS

Google Pixel 8a స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది

ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందించింది

కేవలం 32 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ ను అందుకునే అవకాశం

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ నుంచి Google Pixel 8a స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. గొప్ప కెమెరా కలిగిన ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్స్ తో కేవలం 32 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ ను అందుకునే అవకాశం అందించింది. ఇటీవల కూడా ఈ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్ అందించింది. అయితే, లేటెస్ట్ సేల్ నుంచి అంతకు మించి ఆఫర్స్ అందించింది.

Google Pixel 8a : ఫ్లిప్ కార్ట్ ఆఫర్

ఈరోజు నుసి మొదలైన ఫ్లిప్ కార్ట్ SASA LELE సేల్ నుంచి ఈ డీల్ అందించింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ చాలా కాలంగా రూ. 37,999 రూపాయల ధరతో లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ పై SBI కార్డ్స్ రూ. 5,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.

ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 32,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకునే అవకాశం అందించింది.

Google Pixel 8a : ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు పిక్సెల్ ఫోన్స్ అంటేనే కెమెరాకి గొప్పగా ప్రసిద్ధి చెందాయి.ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే, గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్లలో ఈ ఫోన్ కూడా గొప్ప కెమెరా ఫీచర్స్ మరియు కలిగి ఉంటుంది. ఈ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ 64MP మెయిన్ కెమెరాకి జతగా 13MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

ఈ ఫోన్ 30fps మరియు 60fps వద్ద కూడా వీడియో రికార్డ్ చేసే సత్తా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో Live HDR+, మ్యాజిక్ ఎడిటర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ 6.1 ఇంచ్ ఆక్టువ డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 రక్షణ, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: అమెజాన్ సేల్ నుంచి Samsung Galaxy S24 Ultra పై రూ. 45,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ ను గూగుల్ యొక్క Tensor G3 చిప్ సెట్ మరియు జతగా Titan M2 సెక్యూరిటీ చిప్ సెట్ తో కూడా జతగా అందిస్తుంది. ఈ ఫోన్ వైర్డ్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4404 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :