google pixel 7a today available with never before discount offer on flipkart sale
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ పై రోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గొప్ప కెమెరా సెటప్ మరియు మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి వున్నా ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి చవక ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో 28 వేల బడ్జెట్ లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేయండి.
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 43,999 రూపాయల ప్రారంభ ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 30,999 రూపాయల ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ను ICICI Bank Credit Card ఆప్షన్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 28,999 రూపాయల చవక ధరకు పొందవచ్చు.
Also Read: BSNL యూజర్లకు చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ 64MP మైన మరియు 13MP సెకండరీ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు 13MP సెల్ఫీ కెమెరా లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలు అందిస్తుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ అంటే కెమెరా కి పెట్టింది పేరు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫోన్ Tensor G2 చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ గూగుల్ ఫోన్ 6.1 ఇంచ్ FHD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 24 Bit డెప్త్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4300 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. చవక ధరలో గూగుల్ పిక్సెల్ కోరుకునే వారికి ఇది గొప్ప డీల్ అవుతుంది.