మొదలైన Google Pixel 3A మరియు Google Pixel 3A XL అమ్మకాలు

Updated on 15-May-2019
HIGHLIGHTS

గూగుల్ I/O 2019 ద్వారా గూగుల్ తన Google Pixel 3A మరియు Google Pixel 3A XL స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచనా ప్రాయంగా విడుదల చేసింది.

ఈరోజు నుండి ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క అమ్మకాలు Flipkart నుండి మొదలయ్యాయి .

గతవారం, గూగుల్ I/O 2019 ద్వారా గూగుల్ తన Google Pixel 3A మరియు Google Pixel 3A XL స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచనా ప్రాయంగా విడుదల చేసింది. ఇప్పుడు, ఈరోజు నుండి ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క అమ్మకాలు Flipkart నుండి మొదలయ్యాయి . ముందునుండే అనుకున్నట్లుగానే, పిక్సల్ 3 సిరీస్ నుండి తక్కువ ధరకు లభించనున్న స్మార్ట్ ఫోన్లుగా ఈ Google Pixel 3A మరియు Google Pixel 3A XL స్మార్ట్ ఫోన్లు నిలుస్తాయి. ఈ రెండు ఫోనులు కూడా ఇమేజింగ్ క్యాపబిలిటీ, సెక్యూరిటీ మరియు బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లను కలిగి పిక్సెల్ 3 వలెనే ఉంటాయి. అయితే, ఇది కొంచెం తక్కువ రకం ప్రాసెసర్ తో నడవటం వంటి అంశం కొంత నిరాశకు గురిచేసేదిగా ఉంటుంది.

Google Pixel 3A మరియు Google Pixel 3A XL ధరలు

Google Pixel 3A       – Rs. 39,999

Google Pixel 3A XL – Rs. 44,999

Google Pixel 3A మరియు Google Pixel 3A XL ప్రత్యేకతలు

పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL రెండు స్మార్ట్ ఫోన్లు కూడా  పోలి కార్బోనేట్ యూని బాడీ తో బిల్డ్ చేయబడ్డాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 670SoC  కి జతగా 4GB మరియు 64GB అంతర్గత స్టోరేజితో అందించబడ్డాయి. ఒరిజినల్ ఫిక్సెల్ 3 వలెనే ఈ రెండు ఫోన్లు కూడా టైటాన్ M సెక్యూరిటీ మాడ్యూల్ తో వస్తాయి. ఇది నోచ్  లేకుండా 18: 9 యాస్పెక్ట్ రేషియోతో డిస్ప్లేను అందిస్తుంది.

అయితే, గూగుల్ పిక్సెల్ 3a 5.6 అంగుళాల FHD+ రిజల్యూషన్ గల gOLED డిస్ప్లేతో 2220×1080 పిక్సెల్ రిజల్యూషనుతో వస్తే, గూగుల్ పిక్సెల్ 3a XL     మాత్రం పెద్దదైన ఒక 6.3-అంగుళాల FHD+ రిజల్యూషన్ గల gOLED డిస్ప్లేతో 2160×1080 పిక్సెల్ రిజల్యూషనుతో వస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా  డ్రాగన్ టేల్ గ్లాస్  ప్రొటక్షన్ తో అందించబడ్డాయి. అలాగే ఈ రెండు కూడా  స్నాప్డ్రాగెన్ 670 SoC ఆధారితమైనవి. అయితే, పిక్సెల్ 3a ఒక 3,000 mAh బ్యాటరీ మద్దతుతో వస్తే, పిక్సెల్ 3a XL మాత్రం కొంచెం పెద్దదైన ఒక 3,700 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు ఫోన్లు కూడా ఒక వేగవంతమైన 18W చార్జరుతో మరియి టైప్ -C పోర్టుతో వస్తాయి.

ఇక పిక్సెల్ ఫోన్లలో ప్రధానాంశమైన కెమేరా విభాగానికి వస్తే, ఈ రెండు ఫోన్లు కూడా వెనుకభాగంలో f/1.8 అపర్చరు కలిగిన ఒక 12.2MP Sony IMX363 సెన్సారును కలిగివుంటాయి. ముందుభాగంలో, f/2.0 అపర్చరు కలిగిన ఒక 8MP కెమేరాని 84 డిగ్రీల ఫీల్డ్ వ్యూ తో కలిగివుంటుంది. అలాగే, ఇవి రెండు కూడా పిక్సెల్ 3 కలిగినటువంటి నైట్ సైట్, టాప్ షాట్, పోర్ట్రైట్ మోడ్, సూపర్ రెస్ జూమ్, HDR + కాప్చర్ మరియు మరిన్ని కెమేరా ఫీచర్లతో వస్తాయి.

ఈ ప్రధాన కెమేరాతో 4K వీడియోని 30fps తో, 1080p వీడియోని 30fps,60fps మరియు 120fps వద్ద మరియు 720p వీడియోని 30fps,60fps మరియు 240fps వద్ద తీసుకునే వీలుంటుంది.  ఇది కేవలం ఒక SIM తో మాత్రమే వాడుకునే వీలుంటుంది, అదీకూడా eSIM ని మాత్రమే వాడుకోవలిసివుంటుంది. అలాగే, ఇవి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9 ఫై OS పైన నడుస్తాయి.

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :