Google Pixel 10a: ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకర్షణీయ ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో అడుగుపెట్టింది

ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకర్షణీయ ధరలో లాంచ్ అయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ లెవల్ ఫీచర్స్ ను కేవలం మిడ్ రేంజ్ ధరలో కలిగి ఉంటుంది

Google Pixel 10a: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకర్షణీయ ధరలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ లెవల్ ఫీచర్స్ ను కేవలం మిడ్ రేంజ్ ధరలో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా గూగుల్ లేటెస్ట్ చిప్ సెట్ మరియు లేటెస్ట్ డిజైన్ తో అందించింది. ఇండియాలో సరికొత్తగా విడుదలైన ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Google Pixel 10a: ప్రైస్

గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ రూ. 49,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో విడుదల చేసింది. ఇది గత సిరీస్ బడ్జెట్ ఫోన్ కు సమానమైన ధరతో కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ముందస్తు ఆర్డర్ ను ఈరోజు నుంచి గూగుల్ ప్రారంభించింది. అయితే, మార్చి 6వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్స్:

ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ ను కంపెనీ ప్రకటించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో తీసుకునే వారికి కూడా రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది.

Also Read: AI ఇంపాక్ట్ సమ్మిట్ లో చైనా రోబోట్ ప్రదర్శించి అభాసుపాలైన Galgotias University

Google Pixel 10a: ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ 6.3 ఆక్టువా OLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ 7i రక్షణ తో గూగుల్ అందించింది. ఈ పిక్సెల్ ఫోన్ గూగుల్ లేటెస్ట్ చిప్ సెట్ Tensor G4 జతగా 8GB RAM మరియు 256GB కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో అందించింది. అంతేకాదు, అదనపు సెక్యూరిటీ కోసం Titan M2 security కో ప్రోసెసర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

ఈ ఫోన్ లో 48MP Quad PD డ్యూయల్ పిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 13MP అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ ముందు వెనుక కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. రియర్ కెమెరా 60FPS 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో టన్నుల కొద్దీ గూగుల్ మరియు AI కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.

ఈ గూగుల్ ఫోన్ 5,100mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. అంతేకాదు, 45W USB-C ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు Qi-certified వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :