Google Pixel 10 Pro launch date confirmed and what to expect
Google Pixel 10 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను గూగుల్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. గూగుల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ పిక్సెల్ 10 సిరీస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది పండగలాంటి వార్త అవుతుంది. ఈ సిరీస్ నుంచి ప్రస్తుతానికి పిక్సెల్ 10 ప్రో వేరియంట్ లాంచ్ గురించి మాత్రమే అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసే ఇతర ఫోన్స్ లేదా డివైజస్ గురించి అఫిషియల్ గా ఎటువంటి ప్రకటన అందించలేదు.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 21వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ టీజర్ పేజీ నుండి సైన్ అండ్ సేవ్ బటన్ అందించింది. ఈ బటన్ తో సబ్ స్క్రైబ్ చేసుకోండి మరియు గూగుల్ పిక్సెల్ ఫోన్ ‘ఎక్స్ క్లూజివ్ ఆఫర్’ లో భాగం అవ్వండి అంటోంది.
ఈ ఎక్స్ క్లూజివ్ ఆఫర్ ఏమిటంటే, ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ కి ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, అప్పుడు ఈ ఫోన్ ఉపయోగించడానికి ఛాన్స్ అందుకుంటారు. అంతేకాదు, ప్రీ ఆర్డర్ నోటిఫికేషన్ కూడా అందుకుంటారు.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ను Google Tensor G4 చిప్ సెట్ తో అందించే అవకాశం ఉంటుంది. ఇది 3 nm TSMC చిప్ సెట్ అవుతుందని ఊహిస్తున్నారు. ఈ చిప్ సెట్ కి జతగా టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రోసెసర్ కూడా ఉంటుంది. గత సిరీస్ మాదిరిగానే ఈ సిరీస్ ప్రో ఫోన్ ను కూడా 16 జీబీ ఫాస్ట్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోన్ లో 6.3 ఇంచ్ LTPO OLED స్క్రీన్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కాకుండా, ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో రావచ్చు. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ అయ్యింది. దీనికి తగ్గట్టుగా ఈ ఫోన్ లో 50MP మెయిన్, 48MP అల్ట్రా వైడ్ మరియు 48MP టెలిఫోటో సెన్సార్లు గురించి కొన్ని రూమర్లు ఊహించి చెబుతున్నాయి.
Also Read: Realme Narzo 80 Lite సర్ప్రైజింగ్ లాంచ్ : ధర మరియు ఫీచర్స్ ఇవే.!
మరి ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ మరియు స్పెక్స్ తో లాంచ్ అవుతోందో తెలియాలంటే, ఆగస్టు 21వ తారీకు వరకు వేచి చూడాల్సిందే.