Google Pixel 10 ఫోన్ ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తోంది.!

HIGHLIGHTS

Google Pixel 10 స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ జత చేసింది

ఫ్లిప్ కార్ట్ కొత్తగా తీసుకొచ్చిన సమ్మర్ సేల్ 2026 నుంచి ఈ బిగ్ డీల్స్ అందించింది

ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందించింది

Google Pixel 10 స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ జత చేసింది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా తీసుకొచ్చిన సమ్మర్ సేల్ 2026 నుంచి ఈ బిగ్ డీల్స్ అందించింది. లేటెస్ట్ ఫీచర్స్ తో గూగుల్ లేటెస్ట్ అందించిన పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో అందుకునే అవకాశం ద్వారా ఫ్లిప్ కార్ట్ సేల్ ద్వారా మనకు అందించింది.

Google Pixel 10: ఆఫర్

గూగుల్ ;పిక్సెల్ 10 అపి ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ నుంచి ఈరోజు అందించిన డీల్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందించింది. ఇందులో ఒకటి ఈ ఫోన్ పై అందించిన రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రెండోది ఈ ఫోన్ పై అందించిన రూ. 4000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్.

గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ నుంచి అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో రూ. 70,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పై తెలిపిన రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే ఒక సమయంలో లభిస్తుంది.

Also Read: Oppo F33 Series 5G: కొత్త లుక్ తో అప్ కమింగ్ సిరీస్ లాంచ్ చేస్తున్న ఒప్పో.!

Google Pixel 10: ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల OLED (ఆక్టువా డిస్ప్లే) కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1080 × 2424 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్, 60Hz – 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G5 చిప్‌సెట్ తో నడుస్తుంది మరియు జతగా Titan M2 సెక్యూరిటీ చిప్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ మరియు 10.8MP టెలిఫోటో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ముందు 10.5MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ ఏ లో ఉంది. ఈ ఫోన్ గొప్ప రిజల్యూషన్ కలిగిన ఫోటోలు, 4K వీడియో మరియు టన్నుల కొద్దీ పిక్సెల్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4970mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ (Qi2) సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :