3gb ర్యామ్ తో Gionee M5 Lite ఇండియాలో లాంచ్

Updated on 12-Jan-2016

ఇండియాలో మారథాన్ M5 Lite అనే పేరుతో Gionee బ్రాండ్ నుండి కొత్త మోడల్ విడుదల అయ్యింది మార్కెట్ లోకి. ధర 12,999 రూ. కంపెని యొక్క సొంత ఆన్ లైన్ స్టోర్ లో అందుబాటులో ఉంది ప్రస్తుతం.

దీనిలో 4000 mah బ్యాటరీ ఉంది. 5in HD డిస్ప్లే, 1.3ghz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT 6735 SoC, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్.

128 gb sd కార్డ్ సపోర్ట్, 8MP కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, Amigo UI with ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 ఉన్నాయి. M5 Lite జెన్ ఫోన్ మాక్స్ మరియు లెనోవో P1M కు పోటిగా ఉంటుంది.

ఆ రెండు మోడల్స్ కూడా బ్యాటరీ ప్రధానంగా వచ్చినవే, ఆసుస్ మాక్స్ లో 5000 mah బ్యాటరీ 9,999 రూ లకు వస్తే, లెనోవో P1M లో 4000 mah బ్యాటరీ with 7,999 ప్రైస్ టాగ్ తో వస్తుంది.

Gionee M5 మారథాన్ ఒరిజినల్ వేరియంట్ ను 17,999 రూ లకు లాంచ్ చేసింది. దీనిలో 6020 mah బ్యాటరీ, 3gb ర్యామ్, 5.5 HD అమోలేడ్ డిస్ప్లే ఉన్నాయి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :