Gionee F9 Plus స్మార్ట్ ఫోన్ను రూ.7,690 విడుదల చేసిన జియోనీ సంస్థ

HIGHLIGHTS

Gionee F9 Plus స్మార్ట్ ఫోన్ను రూ.7,690 విడుదల చేసిన జియోనీ సంస్థ

జియోనీ, ఈ బుధవారం ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ అయినటువంటి, Gionee F9 Plus ను రూ .7,690 ధరకు విడుదల చేసింది. ఈ సంస్థ, ఏడు నెలల తర్వాత ప్రారంభించిన స్మార్ట్‌ ఫోన్ ఇది. జియోనీ ఎఫ్ 9 ప్లస్ స్మార్ట్ ఫోన్ను త్వరలోనే కంపెనీ యొక్క భాగస్వామ్య రిటైలర్లు విక్రయించనున్నారు, అలాగే ఈ ఫోన్ ప్రధాన  ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అమ్మకం కానుంది. వైర్‌లెస్ హెడ్‌హోన్స్, వైర్డ్ హెడ్‌ఫోన్స్ మరియు పవర్ బ్యాంక్‌లను కలిగి ఉన్న GBuddy సిరీస్ ఉపకరణాలను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియోనీ ప్రకారం, ఎఫ్ 9 ప్లస్ రెండు రంగులలో అందించబడుతుంది. జిబుడ్డీ ఉపకరణాల ధర ఇంకా వెల్లడించనప్పటికీ ఈ స్మార్ట్‌ ఫోన్ యొక్క ధరను మాత్రం  రూ .7,690 గా నిర్ణయించింది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ జియోనీ ఎఫ్ 9 ప్లస్ ఒక 6.26-అంగుళాల HD + డిస్ప్లేను పైన ఒక వాటర్‌డ్రాప్ నోచ్ డిజైనుతో కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్, ఒక 1.65GHz వద్ద క్లాక్ చేయబడిన  ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 3GB RAM తో జతచేయబడుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ పరికరంలో సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. జియోనీ ఎఫ్ 9 ప్లస్ 4,050 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile