get rs 10000 big deal on Samsung Galaxy S25 5G today
Samsung Galaxy S25 5G స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ రెండు ప్లాట్ ఫామ్స్ నుంచి కూడా ఈ బిగ్ డీల్ తో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా అనౌన్స్ చేసిన ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి మరియు అమెజాన్ నుంచి కూడా ఈ ఫోన్ పై రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అంటే, మీరు ఈ ఫోన్ అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ ఎక్కడి నుంచి కొనుగోలు చేసినా మీకు భారీ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 80,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈ రోజు ఇదే అమౌంట్ తో ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ను ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 10,000 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మీకు రూ. 70,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
శాంసంగ్ ప్రీమియం సిరీస్ అయిన S-సిరీస్ నుంచి ఈ గెలాక్సీ S25 ఫోన్ ను అత్యాధునిక AI ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్ మరియు మెరుగైన కెమెరా సామర్థ్యాలతో అందించింది. ఈ ఫోన్ కాంపాక్ట్ 6.2 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, FHD రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క శక్తివంతమైన Snapdragon 8 Elite చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో సూపర్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. గెలాక్సీ ఎస్ 25 ఫోన్ లో వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) మరియు 12MP అల్ట్రా-వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా 30FPS వద్ద 8K UHD వీడియో రికార్డింగ్, 4K వీడియో రికార్డింగ్ మరియు పవర్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ తో పాటు వైర్‌లెస్ అండ్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: బడ్జెట్ ధరలో బిల్ట్ ఇన్ Dolby Atmos సౌండ్ బార్ తో వచ్చే బెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv డీల్.!
ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు లైట్ అల్యూమినియం ఫ్రేమ్ గ్లాస్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.