get iPhone 16e at 50k offer price from amazon
iPhone 16e: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ నుంచి విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ వేరియంట్ ఫోన్ ను ఇప్పుడు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 16 సిరీస్ కలిగిన అదే A18 చిప్ సెట్ మరియు సూపర్ కెమెరా సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 50,100 ఆఫర్ ధరకే అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఈ ఫోన్ పై అమెజాన్ అందించిన ఆఫర్స్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ తెలుసుకోండి.
ఐఫోన్ 16e స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో రూ. 59,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి రూ. 5,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 54,100 ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది.
ఐఫోన్ 16e స్మార్ట్ ఫోన్ ను Axis, ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 4,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఐఫోన్ ను కేవలం రూ. 50,100 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: Samsung Galaxy S24 Ultra ఫోన్ పై 45 వేల భారీ తగ్గింపు అందించిన అమెజాన్.!
ఐఫోన్ 16e ఫోన్ A18 చిప్ తో పని చేస్తుంది. ఐఫోన్ 11 కలిగిన A13 బయోనిక్ చిప్ తో పోలిస్తే, ఈ ఫోన్ 80% వేగంగా పని చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ యాపిల్ ఇంటెలీజెన్స్ తో కూడా వస్తుంది మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR స్క్రీన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, దశాబ్దాల కాలం నుంచి యాపిల్ అందిస్తున్న డ్యూరబుల్ డిజైన్ తో కూడా వస్తుంది.
ఈ యాపిల్ ఐఫోన్ 48MP ఫ్యూజన్ కెమెరా కలిగి ఉంటుంది. ఇది 2 ఇన్ వన్ కెమెరా మరియు 2X టెలిఫోటో జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision (60FPS) వీడియోస్, సినిమాటిక్ వీడియో స్టెబిలైజేషన్, Smart HDR 5, నైట్ మోడ్, ట్రూ టోన్ ఫ్లాష్ వంటి అన్ని యాపిల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఏ ఫోన్ లో 4K Dolby Vision వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
ఈ ఫోన్ ఎమెర్జెన్సీ SOS, క్రాష్ డిటెక్షన్, 26 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించగల పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ USB-C ఛార్జ్ పోర్ట్, ఫేస్ ID వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ యాపిల్ యొక్క లేటెస్ట్ iOS 18 పై నడుస్తుంది.