get amazon great freedom sale big deal on iQOO Neo 10R 5G
iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ పై గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బిగ్ డీల్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా. రెండు రోజుల్లో మొదలవుతున్న ఈ సేల్ యొక్క సూపర్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఈరోజు ప్రకటించింది. వీటిలో ఐకూ లేటెస్ట్ మిడ్ రేంజ్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ఐకూ నియో 10 ఆర్ 5 ఫోన్ పై అందించిన డీల్ గొప్పగా ఆకట్టుకుంటోంది. మరి అమెజాన్ అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న ఈ ఆఫర్ వివరాలు ఏమిటో చూద్దామా.
ఐకూ నియో 10 ఆర్ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ప్రస్తుతం రూ. 26,998 ధరలో సేల్ అవుతోంది. అయితే, 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ ఫోన్ ను కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చని అమెజాన్ ఆఫర్ ప్రకటించింది. సేల్ టీజింగ్ లో భాగంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ డీల్ రివీల్ చేసింది.
కేవలం ఇది మాత్రమే కాదు మరిన్ని డీల్స్ కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ పై అందించే కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ఈ డిస్కౌంట్ ధరకు సేల్ నుంచి లభిస్తుందని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
Also Read: UPI New Rules: మూడు రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్.!
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ 8 జీబీ LPDRR5X ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫన్ టచ్ 15 ఆధారితమైన ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.
ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX882) OIS మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది మరియు ఇది కూడా 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్లు మరియు మరిన్ని కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6400 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను చవక ధరలో అందుకునే అవకాశం ఎదురు చూస్తుంటే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ గొప్ప అవకాశం అందుతుంది.