Flipkart Super Value Week : అన్ని బ్రాండ్స్ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్

Updated on 24-Apr-2019
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ సేల్ ద్వారా, మీకు రూ. 99 ధరలో పూర్తి మొబైల్ రక్షణ లభిస్తుంది

3,000 రుపాయల వరకు ఎక్స్చేంజ్ ధరతో పాటుగా 1,000 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఇప్పుడు Flipkart తన అన్లిన్ ఫ్లాట్ఫారం పైన Super Value Week సేల్ పేరుతొ అన్ని రకాల బ్రాండ్స్ యొక్క స్మార్ట్ ఫోన్ల పైన ఉత్తమ ఆఫర్లు మరియు బెస్ట్ డీల్స్  అందిస్తోంది ఈ సేల్ ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగనుంది.  అంతేకాకుండా, కేవలం 99 రూపాయలకే మొబైల్ ఫోన్ల పైన పూర్తి ప్రొటక్షన్ ప్లాన్ను కూడా అందిస్తోంది.   

 ఈ సేల్ నుండి అనేకమైన హానర్ స్మార్ట్ ఫోన్ల  పైన గొప్ప ఆఫర్లను ప్రకటిస్తోంది.  ఇందులో భాగంగా, బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లయినటువంటి,రెడ్మి  6 ప్రో, రియల్మీ 2 ప్రో, ఒప్పో F11 ప్రో మరియు ఇటువంటి మరికొన్నీ స్మార్ట్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్లను ప్రకటించింది. అలాగే, హానర్ 9N, అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 మరియు వివో వై 81 వంటి స్మార్ట్ ఫోన్లు 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తాయి.        

ఫ్లిప్ కార్ట్ యొక్క ఈ సేల్ ద్వారా, మీకు రూ. 99 ధరలో పూర్తి మొబైల్ రక్షణ లభిస్తుంది. దీనితో పాటు మీరు స్క్రీన్ డామేజ్ , వాటర్ డామేజ్ , హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ డిఫెక్ట్  వాటివి వాటి నుండి మీకు రక్షణ లభిస్తుంది. దీనితో పాటు, మీకు సౌకర్యవంతమైన పికప్ మరియు డ్రాప్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు గనుక మీ పాత మొబైల్ ఫోన్ను ఎక్స్చేంజ్  చెయ్యాలనుకుంటే, 3,000 రుపాయల వరకు ఎక్స్చేంజ్ ధరతో పాటుగా 1,000 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :