flipkart offers rs 50000 discount offer on Samsung Galaxy S24 Ultra 5G
Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలు కావడానికి ఇంకా ఐదు రోజులు ఉండగానే
ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫోన్ ఎప్పుడు లేనంత తక్కువ ధరలో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
శాంసంగ్ గెలాక్సీ 24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,29,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 50,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 79,999 రూపాయల ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ ను Axis మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో శాంసంగ్ గెలాక్సీ 24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 78,499 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది.
శాంసంగ్ గెలాక్సీ 24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ డైనమిక్ AMOLED 2X బిగ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ QHD రిజల్యూషన్, గొప్ప బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. గెలాక్సీ 24 అల్ట్రా Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 14 OS తో వస్తుంది మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS కి అప్డేట్ అవుతుంది.
ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రీమియం కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 200MP వైడ్ యాంగిల్, 50MP టెలిఫోటో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 10MP టెలిఫోటో కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3X మరియు 5X ఆప్టికల్ జూమ్ సపోర్ట్, Super HDR ఫోటో సపోర్ట్ మరియు 30FPS వద్ద UHD 8K (7680 x 4320) రిజల్యూషన్ వీడియో రికార్డ్ చేసే సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 120FPS వద్ద 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ 24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Galaxy AI సపోర్ట్ తో మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో సర్కిల్ టు సెర్చ్, AI నోట్ అసిస్టెంట్ మరియు జనరేటివ్ ఎడిట్ వంటి మరియు AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ S-Pen సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప కంఫర్ట్ అందిస్తుంది.
Also Read: iPhone 13 Price Cut: సగం ధరకే లభిస్తున్న ఐఫోన్ 13 ఫోన్.!
గమనిక : ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మేము ఆర్టికల్ రాసే సమయానికి రేటుతో లిస్ట్ అయ్యింది. సమయానుసారం ఈ ఫోన్ ప్రైస్ లో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉండవచ్చు.