Hug Day Big Deal: నథింగ్ ప్రీమియం ఫోన్ Nothing Phone 3 ని సగం ధరకే అందుకోండి.!

HIGHLIGHTS

వాలంటైన్ వీక్ లో ఈరోజు హగ్ డే ను జరుపుకుంటారు

ఈ హగ్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ వాలంటైన్ డే సేల్ నుంచి గొప్ప స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది

Nothing Phone 3 ని సగం ధరకే అందుకునేలా గొప్ప డీల్స్ అందించింది

Hug Day Big Deal: వాలంటైన్ వీక్ లో ఈరోజు హగ్ డే ను జరుపుకుంటారు. ఈ హగ్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ వాలంటైన్ డే సేల్ నుంచి గొప్ప స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది. అదేమిటంటే, నథింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Nothing Phone 3 ని సగం ధరకే అందుకునేలా గొప్ప డీల్స్ అందించింది. ఈ ఫోన్ పై కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మూడు ఆఫర్స్ ను అందించింది. అందుకే, ఈ ఫోన్ ఈరోజు ఇంత తక్కువ ధరలో లభిస్తుంది.

Hug Day Big Deal: Nothing Phone 3

ఫ్లిప్ కార్ట్ సేల్ వాలంటైన్స్ డే సేల్ నుంచి ఈరోజు నథింగ్ ఫోన్ 3 (16GB + 512GB) హై ఎండ్ వేరియంట్ రూ. 89,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ ధరతోనే ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ ను లిస్ట్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై మూడు ఆఫర్లు అందించడం ద్వారా ఈ ఫోన్ ను సగం ధరలో అందుకునే అవకాశం అందించింది.

ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 30,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ప్రధానమైనది. ఈ ఫోన్ పై అందించిన రూ. 10,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ రెండవ గొప్ప ఆఫర్ అవుతుంది. చివరిది ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు రూ. 2,203 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. అంటే, ఈ ఫోన్ పై దాదాపు రూ. 42,203 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ని ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ మీకు కేవలం రూ. 47,796 రూపాయల అతి తక్కువ ధరలో ఈరోజు లభిస్తుంది.

Also Read: సంవత్సరం మొత్తం అధిక డేటా అందించే BSNL బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ ఇదే.!

Nothing Phone 3 : ఫీచర్స్

నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, HDR 10+, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గోరిల్లా గ్లాస్ 7i రక్షణ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 16 జీబీ LPDDR5 ర్యామ్ అండ్ 512 జీబీ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో అందించిన కంట్రోలబుల్ 489 మైక్రో LED లైట్ సెట్టింగ్ ఈ ఫోన్ లో హైలెట్ గా నిలుస్తుంది మరియు ఈ ఫోన్ విలక్షణమైన డిజైన్ తో కూడా ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక మొత్తం నాలుగు 50MP కెమెరాలు ఉంటాయి. వెనుక 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా ఉంటుంది మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ తో సినిమాటిక్ ఎఫెక్ట్ తో 60 FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్ గొప్ప ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. 5500 mAh బ్యాటరీ తో ఈ ఫోన్ వస్తుంది మరియు 65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 15W వైర్లెస్ ఛార్జ్ మరియు 5W వైర్లెస్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :