flipkart offers double dhamaka offer on POCO F7 5G
POCO F7 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ డబుల్ ధమాకా ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ పవర్ ఫుల్ ఫోన్ గా వచ్చింది మరియు మంచి సేల్స్ కూడా సాధించింది. గేమింగ్ కోసం అవసరమైన అన్ని హంగులో ఈ ఫోన్ లో ఉన్నాయి. కెమెరా పరంగా కొంత వెనుకబడినట్లు చెబుతున్నా, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో గొప్ప పోటీ ఫీచర్స్ కలిగిన ఫోన్ గా ఇది నిలుస్తుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఫోన్ పై డబుల్ ధమాకా ఆఫర్స్ కూడా పొందవచ్చు.
ఇప్పటికే అనేకసార్లు చెప్పారు అసలు ఏమిటి ఈ డబుల్ ధమాకా ఆఫర్స్? అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నా. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈ ఫోన్ పై బ్యాంక్ మరియు భారీ అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ రెండు ఆఫర్లు అందించింది. అందుకే ఈ ఆఫర్ ను డబుల్ ధమాకా ఆఫర్స్ అని చెబుతున్నారు. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 31,999 ధరలో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై రూ. 2,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను HDFC, ICICI మరియు మరికొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్స్ తో టోటల్ రూ. 4,000 డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ పోకో కొత్త ఫోన్ ను కేవలం రూ. 27,999 రూపాయల అతి తక్కువ ధరలో పొందవచ్చు.
Also Read: Flipkart Year End Sale: కేవలం 15 వేల ధరకే బ్రాండెడ్ 4K QLED Smart Tv అందుకోండి.!
ప్రొకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ పవర్ ఫుల్ క్వాల్కమ్ చిప్ సెట్ Snapdragon 8s Gen 4 తో ఉంటుంది. ఇది 2.1 మిలియన్ AnTuTu స్క్రీన్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.83 అంగుళాల AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10+ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ కోసం గొప్పగా ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ పోకో ఫోన్ 4K వీడియో సపోర్ట్ మరియు గొప్ప Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7,550mAh బిగ్ బ్యాటరీ తో ఉంటుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.