Flipkart Sale నుండి భారీ డిస్కౌంట్ తో Realme 9 5G సేల్.!!

HIGHLIGHTS

రియల్ మీ 5G స్మార్ట్ ఫోన్ ను మీరు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి చాలా చవక ధరకే పొందవచ్చు

Realme 9 5G స్మార్ట్ ఫోన్ Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

Realme 9 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD+ రిజల్యూషన్ LCD స్క్రీన్ తో వస్తుంది

Flipkart Sale నుండి భారీ డిస్కౌంట్ తో Realme 9 5G సేల్.!!

రియల్ మీ లేటెస్ట్ గా విడుదల చేసిన Realme 9 5G స్మార్ట్ ఫోన్ Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇండియాలో లేటెస్ట్ విడుదలైన ఈ రియల్ మీ 5G స్మార్ట్ ఫోన్ ను మీరు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి చాలా చవక ధరకే పొందవచ్చు. మరి ఫ్లిప్ కార్ట్ నుండి రియల్ మీ 9 5G ఫోన్ పైన అందించిన డీల్స్ మరియు ఆఫర్ల పైన ఒక లుక్ వేద్దామా.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 9 5G: ధర

Realme 9 5G యొక్క బేసిక్ వేరియంట్ (4GB+64GB) ధర రూ.14,999 ధరతో లాంచ్ కాగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి రూ.11,999 రూపాయల భారీ డిస్కౌంట్ అఫర్ ధరకే లభిస్తోంది.

Realme 9 5G: స్పెక్స్

Realme 9 5G స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD+ రిజల్యూషన్ LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది మరియు ఇది పంచ్-హోల్‌ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 810 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 6GB ర్యామ్ మరియు 128GB (UFS 2.1) స్టోరేజ్‌తో వస్తుంది.

వెనుకవైపు, ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 2MP (4cm) మాక్రో సెన్సార్ మరియు 2MP B/W సెన్సార్‌ ఉన్నాయి.ఈ కెమెరాతో 30FPS తో 1080P వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. డ్యూయల్ సిమ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5GB వరకు వర్చువల్ ర్యామ్, డ్యూయల్-మోడ్ 5G, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, బ్లూటూత్ 5.1 మొదలైన ఫీచర్లు కూడా అందుకుంటారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo