Flipkart Month-End మొబైల్ ఫెస్ట్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ అఫార్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి ఇటీవల రియల్ మి ఇండియాలో ప్రకటించిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme 9i పైన మంచి ఆఫర్లను అందించింది. బడ్జెట్ ధరలో 5GB ఎడిషన్ వర్చువల్ RAM సపోర్ట్ తో వచ్చిన ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర రూ. 13,999 మరియు 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 గా నిర్ణయించింది. అయితే , ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి UPI పేమెంట్ చెస్ వారికీ రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Yes బ్యాంక్ మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 1,000 వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ పైన అధిక మొత్తంలో ఎక్స్ చేంజ్ ఆఫర్ ను అందించింది. Check Offer Here
రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన IPSLCD డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది. అంటే, ఈ Realme ఫోన్ 11GB RAM పనితీరును ఇవ్వగలదు మరియు 128GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది.
ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 50MP మైన్ కెమెరా, మ్యాక్రో మరియు B&W సెన్సార్ వున్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది.