flipkart offers big deal on Google Pixel 8a before sale
గూగుల్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ Google Pixel 8a పై ఈరోజు బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. ఈ గూగుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను రూ. 7,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాను.
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ పై ప్రస్తుతం గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి, ప్రీమియం ధరలో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి డిస్కౌంట్ తో రూ. 37,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 7,000 తగ్గింపు ఆఫర్ ని అందించింది. అంటే, ఈ ఆఫర్ తో ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 30,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ యొక్క Tensor G3 చిప్ సెట్ తో అందించింది మరియు దానికి జతగా సెక్యూరిటీ కో చిప్ సెట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ గూగుల్ ఫోన్ 64MP జతగా 13MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K (30fps / 60fps) వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గూగుల్ యొక్క అన్ని కెమెరా ఎడిటింగ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ గూగుల్ ఫోన్ 7 సంవత్సరాల OS మరియు సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ 4404 బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: OPPO F31 సిరీస్ స్మార్ట్ ఫోన్లు కొత్త AI Voice Scribe ఫీచర్ తో లాంచ్ అవుతున్నాయి.!
ఈ గూగుల్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ కంటే ముందే ఈ బిగ్ డీల్ ను యూజర్ల కోసం ఫ్లిప్ కార్ట్ ప్రకటించిందని చెప్పవచ్చు.