ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి CMF Phone 2 Pro గొప్ప ఆఫర్లతో చవక ధరలో లభిస్తోంది.!

Updated on 13-Aug-2025
HIGHLIGHTS

CMF Phone 2 Pro ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తుంది

ఫ్రీడమ్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది

ఈరోజు నుంచి మొదలైన ఈ లేటెస్ట్ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ ఈ నథింగ్ ఫోన్ డీల్ అందించింది

నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుంచి ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ CMF Phone 2 Pro ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ నెల ప్రారంభంలో ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన ఫ్రీడమ్ సేల్ ను ఆగస్టు 15 సందర్భంగా మరోసారి తీసుకు వచ్చింది. ఈ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈరోజు నుంచి మొదలైన ఈ లేటెస్ట్ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ ఈ నథింగ్ ఫోన్ డీల్ అందించింది.

CMF Phone 2 Pro : డీల్

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 18,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ తో చవక ధరలో లభిస్తుంది.

ఈ ఫోన్ పై అందించిన అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 16,499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: Poco M7 Plus 5G: చవక ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

CMF Phone 2 Pro : ఫీచర్లు

ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ యూజర్ కు తగిన ఫీచర్స్ మరియు సరికొత్త డిజైన్ వస్తుంది. ఈ ఫోన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాక్ కవర్ చేంజ్ చేసే బెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చాలా స్లీక్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 7300 Pro 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ అంతర్గత మెమరీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.77 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఆకట్టుకుంటుంది.

ఈ నథింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 2x ఆప్టికల్ జూమ్ మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP + 50MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 16Mp సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ 5000 బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :