Flipkart Diwali Sale offers big deals on MOTOROLA G96 5G
Flipkart Diwali Sale ఈరోజు స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి అందించిన డీల్స్ మరియు ఆఫర్స్ తో ఒక బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యూజర్లను బాగా ఆకర్షించే విధంగా ఉంది. అదేమిటంటే, మోటరోలా ఇటీవల విడుదల చేసిన గేమింగ్ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది కేవలం రూ. 13,499 ధరకే ఆఫర్ చేస్తోంది. అందుకే ఈ బెస్ట్ ని ఫోన్ డీల్ ను ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.
మోటోరోలా ఇటీవల లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా G96 5G పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 23% బిగ్ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 15,999 ఆఫర్ ధరకే లిస్ట్ చేసింది. ఇది కూండా ఈ ఫోన్ పై మరో రెండు బేస్డ్ డీల్స్ కూడా జత చేసింది.
అవేమిటంటే, ఈ ఫోన్ ను IDFC Bank క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది మరియు ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 13,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Ricoh GR కెమెరా కలిగిన మొదటి ఫోన్ Realme GT 8 Pro స్మార్ట్ ఫోన్.!
ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ ధరలో ఈ ఫోన్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉందనే కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ 7.93mm సూపర్ స్లీక్ డిజైన్ లో 5300 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ జి96 ఫోన్ 6.67 ఇంచ్ pOLED స్క్రీన్ ను గేమింగ్ కు అవసరమైన 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ కూడా కలిగి ఉంటుంది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. కెమెరా పరంగా, ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ వెనుక OIS సపోర్ట్ కలిగిన 50MP Sony Lytia 700C మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో 30FPS 4K వీడియో రికార్డ్ చేయవచ్చు మరియు మంచి ఫోటోలు షూట్ చేసే సపోర్ట్ కూడా ఉంటుంది.
ఆడియో పరంగా, ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అల్ట్రా వేగాన్ లెథర్ డిజైన్ మరియు IP68 రేటెడ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.