20 వేలకే ప్రీమియం స్మార్ట్ ఫోన్ కావాలా .. LAVA Virat Curve 5G ఫోన్ డీల్ పై ఒక లుక్కేయండి.!
ఈరోజు మీరు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 20 వేలకే ప్రీమియం 5G ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు
LAVA Virat Curve 5G ఫోన్ ఈరోజు బెస్ట్ డీల్ తో లభిస్తోంది
ఈ లావా స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఒక 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే కనీసం 15 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో కేవలం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల ధరలో కూడా ఒక 5G స్మార్ట్ ఫోన్ లభిస్తే, ఇప్పుడు ఇది ఒక కలగా మారింది. కానీ ఈరోజు మీరు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి 20 వేలకే ప్రీమియం స్మార్ట్ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి డీల్ కోసం చూస్తుంటే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు అందుబాటులో ఉన్న LAVA Virat Curve 5G ఫోన్ డీల్ పై ఒక లుక్కేయండి.
LAVA Virat Curve 5G : డీల్
లావా విరాట్ కర్వ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 22,999 రూపాయల ప్రైస్ టాక్ తో లిస్ట్ అయింది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ పైన ఈరోజు బ్లాక్ ఫ్రైడే సేల్ యొక్క ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను జత చేసింది. అవేమిటంటే, ICICI క్రెడిట్ కార్డు ఫుల్ పేమెంట్ పైన రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ మరియు EMI పైన రూ. 2,000 రూపాయల బరి డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది.
అంటే, ఈ సేల్ నుంచి ఈ ఫోన్ ను ICICI క్రెడిట్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ ఫోన్ కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఈ ప్రైస్ లో బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ మకరాణా ఐవరీ, ఎల్లోరా స్లేట్ మరియు హెరిటేజ్ ఇండిగో అనే మూడు అందమైన రంగుల్లో లభిస్తుంది.
Also Read: Samsung 4K AI Smart TV ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి అత్యల్ప ధరలో సేల్ అవుతోంది.!
LAVA Virat Curve 5G : ఫీచర్స్
ఈ లావా స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1,100 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. లావా ఈ ఫోన్ వెనుకవైపు ప్రత్యేకమైన మినీ డిస్ప్లే అందించింది. ఈ చిన్న స్క్రీన్ లో నోటిఫికేషన్లు, సమయం, బ్యాటరీ శాతం, కస్టమ్ టెక్స్ట్ మరియు ఎమోజీలు చూడవచ్చు.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7100 6nm ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ లో 6GB LPDDR5 RAM జతగా 128GB UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ లో 6GB వర్చువల్ RAM సపోర్ట్ ని కూడా లావా అందించింది. ఈ ఫోన్ క్లీన్ Android 16 తో పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ కు రెండేళ్ల OS అప్డేట్స్ అండ్ మూడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందుతాయి.
కెమెరా విషయానికి వస్తే, ఇందులో EIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 752 ప్రైమరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ అండ్ 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీ మరియు ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లభిస్తుంది. అయితే, బాక్స్ లో 33W ఛార్జర్ మాత్రమే మీకు లభిస్తుంది.
ఈ ఫోన్ IP64 రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్, స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఇతర ప్రత్యేకతలు కూడా కలిగి ఉంటుంది.