ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళీ సేల్ 2019 : ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన సూపర్ డీల్స్ అందుకోండి

Updated on 12-Oct-2019
HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్లను ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరలకు కొనవచ్చు.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసి ఎన్నో రోజులు కాలేదు, అయితే ఈ ఆన్లైన్ ప్లాట్ఫారం ఇప్పుడు తన ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళీ సేల్ 2019 ప్రకటించింది. ఈ సేల్ నుండి అనేకమైన ప్రోడక్టులు పైన చాల డీల్స్ మరియు అనేకమైన ఆఫర్లను ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన చాలా గప్ప డీల్స్ అందించిందని చెప్పొచ్చు. షావోమి, రియల్మీ మరియు వివో వంటి సంస్థల నుండి లేటెస్ట్ గా వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లను ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరలకు కొనవచ్చు. అందుకోసమే,  ఈ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.

REDMI NOTE 7 PRO

ముందస్తు ధర : Rs. 13,999

దీపావళి అఫర్ ధర : Rs. 11,999

అధనపు అఫర్ : HDFC డెబిట్ /క్రెడిట్ 10% క్యాష్ బ్యాక్

ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది.  ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్,  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది.     

Redmi Note 7S

ముందస్తు ధర : Rs. 9,999

దీపావళి అఫర్ ధర : Rs. 8,999

అధనపు అఫర్ : AXIS బజ్ క్రెడిట్ క్రెడిట్ 5% తగ్గింపు

షావోమి రెడ్మి నోట్ 7S స్మార్ట్ ఫోన్,  FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP + 5MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమరా SAMSUNG GM1 సెన్సారుతో వస్తుంది మరియు 5MP కెమేరా పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 13MP AI కెమెరాని అందించారు.

Realme 5

ముందస్తు ధర : Rs. 9,999

దీపావళి అఫర్ ధర : Rs. 8,999

అధనపు అఫర్ : AXIS బజ్ క్రెడిట్ క్రెడిట్ 5% తగ్గింపు 

రియల్మీ సంస్థ,  ఈ Realme 5 స్మార్ట్ ఫోన్ ఒక 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది.  అలాగే ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 3+ రక్షణతో అందించబడినది. ఇందులో 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB /64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు. ఒక ప్రధాన 12MP కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 13 MP  సెల్ఫీ కెమేరాతో వస్తుంది.      

Vivo Z1Pro

ముందస్తు ధర : Rs. 13,990

దీపావళి అఫర్ ధర : Rs. 12,990

అధనపు అఫర్ : SBI క్రెడిట్ కార్డుతో 10% తగ్గింపు 

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్లతో పాటుగా సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన చాలా LAPTOP ల పైన కూడా మచ్చల మంచి డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది.

ల్యాప్ టాప్ ఆఫర్ల కోసం ఇక్కడ ఇచ్చిన LINK పైన నొక్కండి

మరిన్ని ఇతర లాభదాయకమైన ఇతర ఆఫర్ల కోసం ఇక్కడ ఇచ్చిన LINK  పైన నొక్కండి.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :